
ఇదేనా ఆసరా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం వాడీవేడిగా సాగింది. జడ్‌పీ చైర్‌పర్సన్ దఫేదార్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పలువురు శాసనసభ్యులు, జడ్‌పీటీసీ సభ్యులు, ఎంపీపీ లు సమస్యలను ఏకరువు పెట్టారు. వివిధ శాఖల పనితీరును చర్చించారు. కొందరు అధికారుల వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీ తి అక్రమాలకు పాల్పడిన అధికారుల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప ట్టుబట్టారు. సామాజిక భద్రతా పిం ఛన్ల పథకం (ఆసరా)పై చర్చ జరిగినప్పుడు పలువురు స్వపక్ష, విపక్ష స భ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక, పింఛన్ల పంపిణీపై స్పష్టత ఇవ్వకపోతే గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉం డదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ పర్యవేక్షణలో సీపీడబ్ల్యూఎస్ కింద పలు మంచినీటి పథకాల నిర్వహణకు ఏళ్ల తరబడిగా టెండర్లు నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు. రాత్రి పొద్దుపోయే వరకు సాగిన సమావేశంలో ఎనిమిది శాఖల ప్రగ తి నివేదికలపై హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సంయమనంతో సభ్యులకు ప్రభుత్వ లక్ష్యాలు, పథకాలను వివరిస్తూ సాఫీగా నడిపించారు.
‘ఆసరా’లో అసలేం జరుగుతోంది
సమావేశం పింఛన్ల అంశంతోనే ప్రారంభమైం ది. ఎజెండాలో నాలుగో అంశంగా చేర్చినా, ప్రధానంగా భావించి మొదటగా చర్చకు తీసుకున్నారు. ఈ పథకం కింద మొత్తం 3,62,144 దరఖాస్తులు రాగా, 1,99,312 దరఖాస్తులను ఫించన్ల కోసం రెకమండ్ చేశారు. అందులో 1,48,183 మంది అర్హులని ఎంపీడీఓలు ఆన్‌లై న్ ద్వారా అప్‌లోడ్ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ వెంకటేశం వెల్లడిస్తుండగా పలువురు సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఎల్లారెడ్డి, ఆర్మూరు ఎ మ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి మాట్లా డు తూ పింఛన్ల కోసం ఎంతైనా వెచ్చించడానికి సిద్ధమేనని సీఎం ప్రకటిస్తుండగా, క్షేత్రస్థాయి లో అధికారులు అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించడం లేదన్నారు. సగానికి సగం తగ్గించి జాబితాలు ప్రకటిస్తే ప్రజాప్రతినిధులు ఊళ్లకు వెళ్లే పరిస్థితి ఉండదన్నారు.
గాంధారి, భిక్కనూర్, కామారెడ్డి, నవీపేట జడ్‌పీటీసీ సభ్యులు తా నాజీరావు, నంద రమేష్, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఇదే అంశంపై మాట్లాడుతూ పింఛన్లపై పేద ప్రజలు పెట్టుకున్న ఆశలు వమ్ము కాకుం డా చూడాలని, ఆధార్ తదితర లింకులతో సగానికి పైగా తగ్గించాలని చూస్తున్న అధికారులపై దృష్టి సారించాలని కోరారు. నిజామాబాద్ , మాచారెడ్డి, ఎడపల్లి, పిట్లం ఎంపీపీలు యాదగిరి, నర్సింగరావు, రజిత, రజనీకాంత్‌రెడ్డిలు పింఛన్లపై గందరగోళానికి వెంటనే తెరవేసి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, అయినా ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేద ని, అది నిరంతరం సాగే కార్యక్రమమని సభ్యులకు వివరించారు.
రాత్రివరకు సాగిన సమావేశం
సుమారు రెండున్నరేళ్ల తర్వాత జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. ప్రధానంగా ఎనిమిది అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య, ఉపాధిహామీ, ఇం దిర జలప్రభ, విద్యుత్, పంచాయతీరాజ్, ఇందిరమ్మ తదితర పథకాలపైన సభ్యులు రాత్రివరకు చర్చ జరిపిన సభ్యులు ప్రభుత్వ పథకాల అమలులో కొందరు అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఫించన్ల మంజూరుపై మాట్లాడిన ఆర్మూరు ఎంపీపీ పోతు నర్సయ్య ప్రజల వద్దకు వెళ్లాలా? వద్దా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ది, సంక్షేమ ఫలాలు లేకుండా ప్రజల వద్ద కు వెళ్లాలంటే అవమానంగా ఉందన్నారు.
మోర్తాడ్ జడ్‌పీటీసీ సభ్యురాలు ఎనుగందుల అమిత మాట్లాడుతూ చాలాచోట్ల ఎంపీపీలు, జడ్‌పీటీసీలకు సఖ్యత లేకుండా పోతోందన్నారు. ఎంపీపీలు తరచూ వారి కార్యాల యాలకు తాళాలు వేసుకొని వెళ్తుండటంతో ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలు ఎక్కడ కూర్చోవా లో అర్థం కావడం లేదన్నారు. తోటి ప్రజాప్రతినిధులను గౌరవించే సంప్రదాయాన్ని కూడ చూడటం లేదని ఆవేదన చెందారు. అవినీతి అక్రమాలకు పాల్పడే ఎవరినీ వదిలేది లేదని, జిల్లా సమగ్రాభివృద్దిలో అందరూ పాలుపంచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జడ్‌పీ సీఈఓ రాజారాం, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎ.జీవన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ, జడ్‌పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు చైతన్యకుమార్, పి.వెంకటేశం, ప్రభాకర్, గజ్జల భాస్క ర్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాసాచారి, గోవింద్‌వాఘ్మారే, పి.మధుసూదన్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు.