
పోచారం శ్రీనివాస్ రెడ్డి
సాక్షి, కామారెడ్డి : బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు‘‘ నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు చేయ్’’ అన్నట్లు ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బాబ్లీ ఒకటే కాకుండా చాలా ప్రాజెక్టులు కట్టారని తెలిపారు. ఉప ఎన్నికల సమయంలో ప్రచారం వదిలి బాబు బాబ్లీ యాత్రకు వెళ్లారని అన్నారు. బాబ్లీ విషయంలో ఏం చేసినా ఏమీ కాదని బాబుకు ఆనాడు తెలుసని చెప్పారు. చంద్రబాబుపై మహారాష్ట్ర పోలీసులు పెట్టిన కేసులకు.. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. టీడీపీవి బూటకపు మాటలని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment