
'ఆసరా' కోసం నిరసన
వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో పింఛన్లు అందటం లేదని 'ఆసరా' పథకం లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.
ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో పింఛన్లు అందటం లేదని 'ఆసరా' పథకం లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని జాతీయరహదారిపై శనివారం ఉదయం పది గంటల నుంచి బైఠాయించి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోస్టల్ అధికారులు పింఛన్ల పంపిణీలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు లింకు లేదని అనర్హత వేటు వేశారని కొందరు ఆరోపించారు.