ప్రతినెల తమకు ఆసరా పింఛను జారీచేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ఒంటరి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ప్రతినెల తమకు ఆసరా పింఛను జారీచేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ఒంటరి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొందరు ఒంటరి మహిళలు, పొదుపు సంఘాల మహిళలు శనివారం ప్రగతిభవన్‌లో సీఎం ను కలసి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం తమలో ధైర్యాన్ని పెంచిందన్నారు. కేసీఆర్.. ప్రభుత్వ పథకాలపై మహిళలను ఆరా తీశారు. కల్యాణలక్ష్మి పథకం బాగా ఉపయోగపడుతోందని, అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్టళ్లలో గుడ్లు, భోజనం, వసతి బాగుం దని మహిళలు బదులిచ్చారు. ప్రగతిభవన్ నుండి నేరుగా గన్‌పార్క్‌కు వెళ్లిన మహిళలు అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.