సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 2018 ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఆసరా లబ్ధిదారుల వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని మేనిఫెస్టోలో చేర్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి వయసు నిర్ధారణకు ఓటరుకార్డును ప్రామాణికంగా తీసుకోవడం విశేషం. మిగిలిన ఆసరా పింఛన్ల నిబంధనలు యథాతథంగా ఉంటాయి.
నిబంధనలివే..
- 57 ఏళ్లు దాటినవారు అర్హులు.
- 1953– 1961 మధ్య జన్మించి ఉండాలి.
- వయసు నిర్ధారణకు ఓటర్ కార్డు మాత్రమే ప్రామాణికం
- మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలు దాటొద్దు. దరఖాస్తుదారుడి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు దాటొద్దు.
- పింఛన్ కావాలనుకున్న వారు లబ్ధిదారుల పిల్లలు డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తులు, వ్యాపారాలు ఉండరాదు.
- లబ్ధిదారులకు పెద్దవ్యాపారాలు (ఆయిల్, రైస్, పెట్రోల్ పంపులు, షాపులు తదితరాలు) ఉండరాదు.
- విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారు అనర్హులు
- లబ్ధిదారులకు పెద్దవాహనాలు ఉండరాదు, ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు అనర్హులు.
- దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు అనర్హులు.
- లబ్ధిదారుల పిల్లలు ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులై ఉండొద్దు.
ఎంపిక విధానం..
- ఓటరు కార్డులో 2018 నవంబర్ 19 నాటికి 57–64 ఏళ్లు నిండినవారు అర్హులు. గ్రామాల్లో అయితే వీఆర్వోలు, పట్టణాల్లో బిల్‌కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపికలో పాల్గొంటారు.
- ఎంపిక అనంతరం లబ్ధిదారుల ముసాయిదా జాబితాను గ్రామ/ వార్డు సభల ద్వారా ప్రదర్శి స్తారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
- అభ్యంతరాలు, వినతుల తర్వాత తుదిజాబితా రూపొందిస్తారు.
- లబ్ధిదారుల ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు/ బిల్ కలెక్టర్లు సేకరిస్తారు.
- గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు లబ్ధిదారుల తుది జాబితాను కలెక్టర్లకు పంపుతారు.
- లబ్ధిదారుల తుది జాబితాను ఎంపీడీవో/ మున్సిపల్ కమిషనర్లు ప్రస్తుతమున్న ఆసరా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేస్తారు.
ఆసరా మొత్తం లబ్ధిదారులు 39,36,503
వృద్ధులు 13,27,090
వికలాంగులు4,94,787
వితంతువులు14,37,164
చేనేతలు37,093
గీత కార్మికులు 62,510
హెచ్‌ఐవీ రోగులు 24,704
పైలేరియా రోగులు 13,601
బీడీ కార్మికులు 4,08,618
ఒంటరి మహిళలు 1,30,936
Comments
Please login to add a commentAdd a comment