సాక్షి, హైదరాబాద్: దానం నాగేందర్ పార్టీ మారడం కొత్త కాదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దానం రాజీనామా అంశంపై శనివారం కోమటిరెడ్డి స్పందించారు. ‘దానం నాగేందర్ పార్టీ మారడం ఊహించిన విషయమే. గత రెండు సంవత్సరాల నుంచి టీఆర్‌ఎస్‌తో దానం టచ్‌లో ఉన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళడానికి ఫ్లెక్సీలు కూడా రెడీ చేసుకున్నారు. అంతకుముందు కూడా టీడీపీలో చేరి మళ్ళీ కాంగ్రెస్‌కు వచ్చి మంత్రి పదవి అనుభవించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో బీసీలకు న్యాయం జరగడం లేదని చెప్పడం విడ్డురంగా ఉంది. సొంత ఎజెండా కోసమే దానం పార్టీ మారుతున్నారు. అలాంటి దానం ఇంటికి పీసీసీ ప్రెసిడెంట్ వెళ్లడం కూడా కరెక్ట్ కాదు. ఆయనకు అంత స్థాయి లేదు. దానం రాజీనామాను నేతలు ఎవరు సీరియస్‌గా తీసుకోవద్దు.
అసలు టీఆర్‌ఎస్ పార్టీలోనే సామాజిక న్యాయం లేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మోసం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ క్యాబినెట్‌లో బీసీలకు తగిన ప్రాధాన్యత లేదు. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించకుండా కేసీఆర్ మహిళలను అవమాన పర్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాం.. దళిత, గిరిజన, బీసీలకు ప్రాధాన్యతనిచ్చాం. కాంగ్రెస్ నేతలంతా ధైర్యంగా ఉండాలి. రాబోయే కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment