టీఆర్‌ఎస్‌ జాబితాలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు? | TRS to Release Final Candidates List | Sakshi
Sakshi News home page

మరో పది స్థానాలకు టీఆర్‌ఎస్‌ జాబితా

Published Thu, Nov 15 2018 4:22 AM | Last Updated on Thu, Nov 15 2018 11:48 AM

TRS to Release Final Candidates List - Sakshi

దానం నాగేందర్‌, మల్లారెడ్డి, హనుమంతరావు, ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌, కాలేరు వెంకటేశ్‌, శానంపూడి సైదిరెడ్డి

టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో సామాజికవర్గాల వారీగా వివరాలివి..
రెడ్డి – 37, వెలమ– 12, కమ్మ– 6, బ్రాహ్మణ– 1, వైశ్య– 1, ఠాకూర్‌ –1, మున్నూరుకాపు– 8, గౌడ– 6, యాదవ– 5, ముదిరాజ్‌– 1, పద్మశాలి– 1, విశ్వబ్రాహ్మణ –1, పెరిక– 1, వంజర– 1, మాదిగ– 11, మాల– 7, నేతకాని– 1, లంబాడ–7, కోయ–4, గోండు–1, ముస్లిం–3, సిక్కు–1.


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటన జారీ చేశారు. కోదాడ, ముషీరాబాద్‌ స్థానాలకు ఒకటిరెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. తాజాగా ప్రకటించిన జాబితాతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల సంఖ్య 117కు చేరింది. సెప్టెంబర్‌ 6న ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అక్టోబర్‌ 21న మలక్‌పేట, జహీరాబాద్‌ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా పది మంది పేర్లతో జాబితా విడుదల చేశారు.

మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు చామకూర మల్లారెడ్డికి మేడ్చల్‌ స్థానంలో అవకాశం కల్పించారు. గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ను వరంగల్‌ తూర్పు అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావును మల్కాజ్‌గిరిలో పోటీకి దింపారు. అనూహ్యంగా చార్మినార్‌ స్థానంలో ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేశారు. రాజేంద్రనగర్‌లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ప్రకటించడం వల్లే చార్మినార్‌లో ముస్లిం అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది. కోదాడకు వేనపల్లి చందర్‌రావు, ముషీరాబాద్‌కు ముఠా గోపాల్‌ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించింది.

అభ్యర్థుల తాజా జాబితా ఇదీ
మేడ్చల్‌ – చామకూర మల్లారెడ్డి, గోషామహల్‌ – ప్రేమ్‌సింగ్‌రాథోడ్, చార్మినార్‌ – మహ్మద్‌ సలావుద్దీన్‌ లోడీ, వరంగల్‌ తూర్పు – నన్నపునేని నరేందర్, హుజూర్‌నగర్‌ – శానంపూడి సైదిరెడ్డి, వికారాబాద్‌ – డాక్టర్‌ మెతుకు ఆనంద్, అంబర్‌పేట – కాలేరు వెంకటేశ్, మల్కాజ్‌గిరి – మైనంపల్లి హనుమంతరావు, చొప్పదండి – శొంకె రవిశంకర్, ఖైరతాబాద్‌ – దానం నాగేందర్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement