CH Malla reddy
-
మల్లారెడ్డికి మరో షాక్.. భూకబ్జా కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికు మరో షాక్ తగిలింది. పేట్‌బషీర్‌బాద్ పోలీసులు ఆయనపై భూకబ్జా కేసు నమోదు చేశారు. మొత్తం ఏడు సెక్షన్లతో మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపైనా కేసు నమోదయినట్లు సమాచారం.పేట్ బషీర్‌బాద్‌లో 32 గుంటల భూమిని కబ్జా చేశారని, ఆ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని సాఫ్ట్వేర్ ఉద్యోగి శేరి శ్రీనివాస్‌రెడ్డి పేట్‌బషీర్‌బాద్ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది.ఆ వివాదం మరిచిపోకముందే..ఇటీవలె సుచిత్ర సర్కిల్ సమీపంలోని మిలటరి కాంపౌండ్ వాల్ రోడ్డులో మల్లారెడ్డికి ఇతరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం విదితమే. కుత్బుల్లాపూర్ మండలం, జీడిమెట్ల సర్వే నెంబర్ 82లోని భూమిలో గత నెల 18వ తేదీన మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి జోక్యంతో పెద్ద వివాదమే చోటు చేసుకుంది. ఆ సమయంలో మల్లారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు మల్లారెడ్డిని అరెస్ట్ చేసి పేట్ బషీర్బాద్ జైలుకు సైతం తరలించారు. మరోవైపు.. ఈ భూవివాదం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సంచలనం సృష్టించింది కూడా. దీంతో ఈ వివాదాస్పద భూమిలో అధికారులు ఒకటికి రెండుసార్లు సర్వే చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. సర్వే ఆధారంగా రెవెన్యూ అధికారులు 33 గుంటలు మల్లారెడ్డి ఆధీనంలోనే ఉన్నట్లు తేల్చారు. సర్వే నెంబరు 82లోని 33 గుంటల భూమిని ఆయన కబ్జా చేసినట్లు కోర్టుకు నివేదిక అందజేశారు. ఇక.. అయితే ఈ వివాదంలో 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు చివరకు.. మేడ్చల్ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈలోపే మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు కావడం గమనార్హం. -
మల్లారెడ్డి VS అడ్లూరి: సుచిత్ర భూవివాదంలో ట్విస్ట్
హైదరాబాద్, సాక్షి: సుచిత్రం భూవివాదంలో ఉత్కంఠ కొనసాగుతోంది. తనకు, తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన భూమిని ఆక్రమించారని మల్లారెడ్డి వాదిస్తుండగా, మరోవైపు ఆ భూమి తమ 15 మందిదేనని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని విప్ అడ్లూరి లక్ష్మణ్ వాదిస్తున్నారు.సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో ఉన్న భూమి కోసం వివాదం కొనసాగుతోంది. తమ అనుచరులతో మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు ఆ స్థలంలో పాతిన ఫెన్సింగ్, బారికేడ్లను తొలగించే యత్నం చేశారు. ఇంకోవైపు అక్కడికి చేరుకున్న 15 మంది ఆ స్థలం తమదేనని వాదించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకుని సర్దిచెప్పబోయిన పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి పేట్ బషీర్బాద్ పీఎస్‌కు తరలించారు. పోలీసుల జోక్యంతో.. రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో సర్వే చేపట్టారు. తాజాగా వివాదాస్పద భూమిపై సర్వే పూర్తైంది. యితే పోలీసులకు సర్వే రిపోర్ట్ ఇస్తారని భావించగా.. బదులుగా కలెక్టర్‌కు రెవెన్యూ అధికారులు నివేదికను సమర్పించబోతున్నారని తెలుస్తోంది. దీంతో స్థల వివాదానికి ఎలాంటి ముగింపు దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. -
మల్లారెడ్డి భూ వివాదంలో మరో ట్విస్ట్..
సాక్షి, కుత్బుల్లాపూర్: సుచిత్ర సెంటర్లోని భూమి వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, బాధితుల మధ్య తీవ్ర విగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) భారీ బందోబస్తు మధ్య పోలీసులు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ సందర్భంగా వివాద స్థలం ఉన్న ప్రాంతానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలు వచ్చారు. తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో అధికారులు తమకు సహకరించడంలేదని మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సర్వే ముగిసిన తర్వాత మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సర్వే రిపోర్ట్ వచ్చేందుకు ఒక్కరోజు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ల్యాండ్ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ స్పందించారు. ఆ భూమిలో తాను కూడా కొంత ల్యాండ్ కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2015 82/e సర్వే నెంబర్లో వేరే వ్యక్తి దగ్గరి నుంచి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిసిన తర్వాతే మేము భూమి కొనుగోలు చేశాము. 15 మంది వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని.మల్లారెడ్డితో ఈ ల్యాండ్ వివాదంపై పలుమారు మాట్లాడాము. బేరి సుభాష్ రెడ్డితో పాటు మరికొంత మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదు. తనకు సర్వే అవసరంలేదని చెప్పారు. 82/e సర్వే నెంబర్లో ల్యాండ్‌పై ఇంజెక్షన్ అర్డర్ వేసినా దానికి కౌంటర్ వేయలేదు.మల్లారెడ్డి పలుమార్లు నాపేరు ప్రస్తావించినందుకే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పారు. కేటీఆర్ మాటలను కూడా మల్లారెడ్డి పెడచెవిన పెట్టారు. అధికారికంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి ఎన్నో ఆటలు ఆడాడు. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో మల్లా రెడ్డి ఆధీనంలో ఉన్న భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. శనివారం రోజున సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం, మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పోలీసుల అదుపులో మల్లారెడ్డి.. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్, సాక్షి: కుత్బుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి హల్ చల్ చేశారు. అయితే ఆ స్థలం తమదేనంటూ వీళ్లిద్దరినీ కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసుల అదుపులో మల్లారెడ్డిసుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 భూవివాదం వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని పేట్‌బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన ట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డిని, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారంటూ ధర్నా చేపట్టారు. పోలీస్ స్టేషన్లోకి మీడియాను పోలీసులు అనుమతించడం లేదుస్థానికంగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బారికెడ్లను తొలగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి-రాజశేఖర్‌రెడ్డిలకు వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితి ఉద్రిక్తంగా మాకోరుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. -
ఈటల గెలుపుపై మల్లారెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలవబోతున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మల్లారెడ్డి తన రాజకీయం అనుభవంతోనే ఈటలపై ఆ కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. మల్లారెడ్డి చాలా తెలివిగల వ్యక్తి అని, ఈటల రాజేందర్‌ను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది ఆయన వ్యూహమని తెలిపారు.బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈటలపై చేసిన వ్యాఖ్యల విషయంలో మల్లారెడ్డి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారని తెలిపారు. మల్లారెడ్డి మాటల అంతరార్థం తెలియక కొంతమంది ఆగమాగమవుతున్నారని, ఆయన వ్యాక్యాలు సీరియస్‌గా తీసుకోవద్దని తెలిపారు. మల్కాజ్‌గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. అది ఈటల రాజేందర్‌కు కూడా తెలుసన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పారు కేటీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి,నేషనల్ మీడియాలో ప్రధాని మోదీకి ఓటేయ్యండి అంటూ చెబుతున్నారని విమర్శించారు. త్వరలో రేవంత్ ఖచ్చితంగా బీజేపీలోకి వెళతారని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికీ వరకు ప్రతి ఇంట్లో కేసీఆర్‌ను తలుచుకోని రోజు లేదని అన్నారు. అధికార కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తోందని దుయ్యబట్టారు. చదవండి: కోమటిరెడ్డి.. మాటలు జాగ్రత్త: కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు‘రేవంత్ రెడ్డి సీక్వెన్స్ మోసాల సినిమాలు చూపిస్తున్నాడు. దేవుడి మీద ఒట్లు పెడుతూ, ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేస్తున్నాడు. కొండంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నాడు కదా. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు.2014లో బడే బాయ్ బడా మోసం చేశారు. అనేక హామీలు ఇచ్చిన మోదీ ఏవీ చేయలేదు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ. ప్రపంచ వ్యాప్తంగా క్రుడ్ ఆయిల్ ధరలు తగ్గితే కనీసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. టోల్ లేని జాతీయ రహదారులు ఉన్నాయా? దేశంలో టోల్ పెట్టీ తోలు తీస్తుంది మోదీ ప్రభుత్వం. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీతో జతకట్టి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది . మమ్మల్ని 10 నుంచి 12 సీట్లతో గెలిపించండి. కాంగ్రెస్ మెడలు వంచుతాం.కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ లో ఏ నాయకుడు చేయలేదు. వరంగల్ ప్రజలను దారుణంగా మోసం చేశారు కడియం. ప్రపంచం వరంగల్ వైపు చూసేలా చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి ముందుగా వరంగల్ కళతోరణం రాష్ట్ర అధికారిక ముద్రలో తీసినందుకు క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
మళ్లీ పోటీ చేయను.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని.. ఇవే తనకు చివరి ఎన్నికలని తెలిపారు. పార్టీ మారనున్నారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్నదంతా అసత్య ప్రచారమని అన్నారు. కాగా మల్లారెడ్డి గురువారం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, తనయుడు భద్రారెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ మళ్లీ పుకార్లు గుప్పుమన్నాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో డీకేను కలిసినట్లు తెలిపారు. తన మిత్రుడుకి సంబంధించిన యూనివర్సిటీ కొనుగోలు కోసం మాట్లాడేందుకు మాత్రమే వెళ్ళానట్లు పేర్కొన్నారు. ఓ మధ్యవర్తితో డీకేశివకుమార్ వద్దకు వెళ్లిన్నట్లు మల్లారెడ్డి చెప్పారు. రెండు రోజుల కింద కలిశానని.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. శివకుమార్ తనకుకు మిత్రుడని పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని.. తమ కుటుంబ సభ్యులు వేరే పార్టీల నుంచి పోటీచేయరన్నారు. ఈ ఐదేళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. చదవండి: తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్ -
నేను పార్టీ మారడం లేదు: మల్లారెడ్డి క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారడం లేదని కార్లిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మల్లారెడ్డి శుక్రవారం కలిశారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు భద్రారెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని తెలిపారు. మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ ఎవరికి టికెట్. ఇచ్చిన గెలిపించుకుంటామని పేర్కొన్నారు. గురువారం సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడంపై మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాల కూల్చివేత అంశంపై కలిసినట్లు పేర్కొన్నారు. ఇదే విషయం కేసీఆర్‌ను కలిసి కూడా చెప్పినట్లు తెలిపారు. తనకు పార్టీ మారరే ఉద్ధేశ్యం లేదని చెప్పారు. సోషల్ మీడియా తమకు నచ్చినట్లు రాసుకుంటుందని, దానిని తాను పట్టించుకోనని అన్నారు. కాగా గత నెలలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే నేడు లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని భద్రారెడ్డి కేటీఆర్‌కు తెలిపినట్లు సమాచారం. చదవండి: మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ సర్కార్: ఎమ్మెల్సీ కవిత ఫైర్ -
Mallareddy: మల్లారెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. శామీర్‌పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించేది నేనే!’ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడిన ఓ సంచలనమే. మల్లారెడ్డి నోటి నుంచి వచ్చే మాటలకు జనాల్లో, సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన చేసే వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలతో కొత్త చర్చకు తెరలేపారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిని తానే నిర్ణయిస్తానని, మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇప్పించింది తానేనని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించడంలో తనదే నిర్ణయాత్మక పాత్ర అని పేర్కొన్నారు. మేడ్చల్ కాంగ్రెస్‌లో గ్రూపు గొడవల వెనుక తామే ఉన్నామని చెప్పుకొచ్చారు. గతంలో తనపై జరిగిన ఐటీ దాడుల అంశాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘‘ఐటీ అధికారులు నా ఇంట్లో డబ్బులు ఉన్న గదిని చూడలేదు. ఆ డబ్బులు ఇప్పుడు ఎన్నికలకు ఖర్చు చేస్తా..’’అని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానా, మరొకరు పోటీ చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని పేర్కొన్నారు. చదవండి: నాలుగేళ్లుగా చేయనిది.. ఈ రెండు నెలల్లో చేస్తారా? -
మా సమావేశానికి కారణం మంత్రి మల్లారెడ్డే: ఎమ్మెల్యే మైనంపల్లి
-
రహస్య భేటీ కాదు.. మంత్రి మల్లారెడ్డే కారణం: ఎమ్మెల్యే మైనంపల్లి
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం అయిన విషయం తెలిసిందే. మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతితోనే ఈ ఎమ్మెల్యేలు భేటీ నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ(శేరిలింగంపల్లి), వివేక్ గౌడ్ (కుత్బుల్లాపూర్), మాధవరం కృష్ణారావు(కూకట్పల్లి), బి సుభాష్‌రెడ్డి(ఉప్పల్) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. తమ సమావేశానికి మంత్రి మల్లారెడ్డే కారణమని తెలిపారు. పదవులు తీసుకున్న వాళ్లే 3,4 పదవులు తీసుకున్నారని మైనంపల్లి ఆరోపించారు. కార్యకర్తల సమస్యలపై ఎమ్మెల్యేలు కలవడం తప్పా అని ప్రశ్నించారు. ప్రతి దాన్నీ రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఇది రహస్య సమావేశం కాదని.. కార్యకర్తల కోసమే భేటి అయినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కేడర్ ఇబ్బందులు పడుతోందని, కేడర్ గురించి మాట్లాడకపోతే డమ్మీలవుతామని అన్నారు. చదవండి: మేడ్చల్ బీఆర్ఎస్లో కోల్డ్‌వార్.. మంత్రి మల్లారెడ్డిపై కేటీఆర్ దగ్గరకు ఎమ్మెల్యే పంచాయితీ! కార్యకర్తల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మంత్రికి లేదా అని మైనంపల్లి ప్రశ్నించారు. కేడర్ కష్టపడి పనిచేస్తోందని.. వారికి న్యాయం జరగాలని అన్నారు. ఎవరో చేసిన దానికి పార్టీ డ్యామేజ్ అవుతోందని ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. పనిచేసే క్యాడర్‌ను కాపాడుకోవాలని, సిస్టమ్‌లో మార్పు రావాలని ఆకాక్షించారు. ‘ఎవరో ఒకరు చెప్పకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయి. మా సమావేశం తప్పేమీ కాదు. మంత్రి కేటీఆర్‌ను కలవాలనుకున్నాం. ఈ సమస్య అన్ని పార్టీలో ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలోనూ కేడర్‌తో ఎమ్మెల్యేలకు సమస్యలు ఉన్నాయి. కొంతమంది మంత్రులు తమ వాళ్లకు పదవులు ఇప్పించుకున్నారు. నా కొడుకు కోసం మీటింగ్ అన్న ప్రచారం నన్ను హర్ట్ చేసింది’ అని ఎమ్మెల్యే తెలిపారు. -
హైదరాబాద్‌లో ధోని క్రికెట్ అకాడమి ప్రారంభం
MS Dhoni Cricket Academy In Hyderabad: భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ)ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తుండడం గొప్ప విషయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి కొనియాడారు. శుక్రవారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)లో జరిగిన ఎంఎస్‌డీసీఏ అకాడమీ ప్రారంభోత్సవంలో మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఎంఎస్‌డీసీఏ–ఆర్కా మేనేజింగ్ డైరెక్టర్ మిహిర్ దివాకర్ పాల్గొన్నారు. తొలుత మంత్రి సమక్షంలో ఎంఎస్‌డీసీఏతో రెండేళ్ల కాలానికి కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం, పల్లవి విద్యాసంస్థల చైర్మన్ మల్కా కొమరయ్య, మిహిర్ దివాకర్ మార్చుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎంఎస్‌డీసీఏను ఉన్నత ప్రమాణాలతో నడుపుతూ భవిష్యత్‌లో ధోనీ వంటి ఉత్తమ క్రికెటర్లను టీమిండియాకు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ‘ఎంఎస్‌డీసీఏ’ను స్థాపించినట్టు ఆ సంస్థ ఎండీ మిహిర్ చెప్పారు. తొలి దశలో భాగంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం)లో ఈ నెలాఖరు నుంచి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. -
GHMC: మేయర్ సహా మంత్రులకు జీహెచ్ఎంసీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీ నుంచి ట్విట్టర్ ద్వారా ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఇతర నిబంధనల అతిక్రమణలపై ఫిర్యాదుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగంలోని సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(సీఈసీ) ఫిర్యాదుల స్వీకరణను పునరుద్ధరించింది. టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలతో నగరాన్ని నింపేందుకు, వారికి పెనాల్టీలు వేయకుండా ఉండేందుకేనని ప్రజల నుంచి ముఖ్యంగా నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సర్వర్ అప్డేషన్ కోసమని సీఈసీ పేర్కొన్నా ప్రజలు విశ్వసించలేదు. ప్రతిపక్ష రాజకీయపార్టీలు ఆందోళనలు సైతం నిర్వహించాయి. ► తాజాగా ట్విట్టర్ ఖాతా తెరిచి ఇన్ని రోజుల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ చలానాలతో పెనాల్టీలు విధించారు. ఈ పెనాల్టీల విధింపులో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. పెనాల్టీల విధింపు ఇంకా కొనసాగుతోంది. తాజా సమాచారం మేరకు జారీ అయినా పెనాల్టీల్లో ఆయా నాయకులకు పడ్డ మొత్తం పెనాల్టీలు దాదాపుగా దిగువ విధంగా ఉన్నాయి. (వాట్సాప్ చెకింగ్ వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్) ► ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో ఫ్లెక్సీల ఏర్పాటుకు ఈ పెనాల్టీలు విధించారు. అందరికంటే ఎక్కువగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు రూ.3 లక్షలకు పైగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రూ.1.60 లక్షలకు పైగా పెనాల్టీలు పడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట రూ.2.20 లక్షలు, మంత్రి చామకూర మల్లారెడ్డికి రూ.10 వేలు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావుకు రూ.10 వేలు, కాలేరు వెంకటేశ్‌కు రూ.25 వేలు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి రూ.60వేలు పెనాల్టీలు పడ్డాయి. కార్పొరేటర్ రాగం సుజాత రూ.2 లక్షలు. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. (చదవండి: రిటైరైనవారు ప్రభుత్వ సలహాదారులా?) -
ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా అర్బన్ పార్కులు
సాక్షి,హైదరాబాద్/మేడ్చల్: రాష్ట్రంలో ప్రభుత్వపరంగా అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు రాబోయే రోజుల్లో ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పనిచేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును సీఎస్ సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోడల్ పార్కు (మియావాకి ప్లాంటేషన్)లో రాష్ట్రమంతటా కనీసం ఒక ఎకరంలో భారీగా మొక్కలు నాటి చిట్టడవులుగా మారుస్తామని చెప్పారు. నిధుల కొరతను అధిగమించి శాచురేషన్ పద్ధతిలో అటవీ పునరుజ్జీవ చర్యలు చేపడతామని,ఫెన్సింగ్ నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కొద్దిసేపు పాల్గొన్న మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన ఈ ఆక్సిజన్‌పార్కు ఆహ్లా దకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అటవీ పునరుజ్జీవనం, తేమ పరిరక్షణ తదితర వివరాలను సీఎస్‌కు అధికారులు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 5 కి.మీ పరిధిలో 59 అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 16 న సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఉద్యానవనాల అభివృద్ధిపై చర్చిస్తారని వెల్లడించారు. వీటిలో 32 ఇప్పటికే పూర్తయ్యాయని సీఎస్‌కు పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 95 అటవీ పార్కులు ఏర్పాటు చేయాలనే ప్రణాళికలున్నాయని చెప్పారు. కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, జాయింట్ సెక్రటరీ ప్రశాంతి, మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు పీసీసీఎఫ్‌లు డీఎఫ్‌వోలు పాల్గొన్నారు. -
నమ్మకానికి మారు పేరు భారతి సిమెంట్
నెల్లూరు(సెంట్రల్): నమ్మకానికి మారుపేరుగా ఉన్న భారతి సిమెంట్ అభివృద్ధికి డీలర్స్ ఎంతో సహాయపడ్డారని మార్కెటింగ్ వైస్ చైర్మన్ సీహెచ్ మాల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నెల్లూరులోని మినర్వాగ్రాండ్‌లో భారతి సిమెంట్ డీలర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్లారెడ్డి మాట్లాడుతూ రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్, ట్యాంపర్ఫ్రూప్ ప్యాకింగ్, జర్మన్ టెక్నాలజీ వంటి వాటితో భారతి సిమెంట్ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొందన్నారు. ఇటీవలే ఆవిష్కరించిన నూతన ప్రొడక్ట్ భారతీ అల్ట్రా ఫాస్ట్ చాలా వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. ఎక్కువ బలం, ధృడమైన ఇళ్ల నిర్మాణానికి ఈ సిమెంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ చీఫ్ మేనేజర్ సీ ఓబుల్‌రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ ఛాయపతి, మార్కెటింగ్ మేనేజర్స్ విజయవర్దన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మార్కెటింగ్ ఆఫీసర్ కృపరాజు, డీలర్స్పాల్గొన్నారు. -
కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు
సాక్షి, మొయినాబాద్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయంలో మొక్కు చెల్లించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం బాలాజీ దేవాలయానికి వచ్చిన ఆయన ఆలయ గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షణలు చేశారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతం కావడంతోపాటు చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన చిలుకూరులో 108 ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆయనతోపాటు 108 ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో సుందరేశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. మంత్రి రాకతో ఆలయ ప్రాంగణంలో రాజకీయ నాయకుల సందడి నెలకొంది. కార్యక్రమంలో చిలుకూరు సర్పంచ్ గునుగుర్తి స్వరూర, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జీటీఆర్ మండల అధ్యక్షుడు దేవరంపల్లి మహేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, ఎంపీటీసీ రవీందర్, మాజీ ఎంపీటీసీ గుండు గోపాల్, మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి, మాజీ ఉపసర్పంచ్ ఆండ్రూ, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, ఏఎంసీ వైస్ చైర్మన్ దారెడ్డి వెంకట్‌రెడ్డి, చిన్నమంగళారం సర్పంచ్ సుకన్య, నాయకులు హరిశంకర్ గౌడ్, విష్ణుగౌడ్, రవియాదవ్, రాఘవేందర్ యాదవ్, గడ్డం అంజిరెడ్డి, చెన్నయ్య ఉన్నారు. -
టీఆర్ఎస్ జాబితాలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు?
టీఆర్ఎస్ ఇప్పటివరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించింది. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో సామాజికవర్గాల వారీగా వివరాలివి.. రెడ్డి – 37, వెలమ– 12, కమ్మ– 6, బ్రాహ్మణ– 1, వైశ్య– 1, ఠాకూర్ –1, మున్నూరుకాపు– 8, గౌడ– 6, యాదవ– 5, ముదిరాజ్– 1, పద్మశాలి– 1, విశ్వబ్రాహ్మణ –1, పెరిక– 1, వంజర– 1, మాదిగ– 11, మాల– 7, నేతకాని– 1, లంబాడ–7, కోయ–4, గోండు–1, ముస్లిం–3, సిక్కు–1. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటన జారీ చేశారు. కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు ఒకటిరెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. తాజాగా ప్రకటించిన జాబితాతో టీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య 117కు చేరింది. సెప్టెంబర్ 6న ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అక్టోబర్ 21న మలక్‌పేట, జహీరాబాద్ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా పది మంది పేర్లతో జాబితా విడుదల చేశారు. మల్కాజ్గిరి లోక్‌సభ సభ్యుడు చామకూర మల్లారెడ్డికి మేడ్చల్ స్థానంలో అవకాశం కల్పించారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్‌ను వరంగల్ తూర్పు అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావును మల్కాజ్‌గిరిలో పోటీకి దింపారు. అనూహ్యంగా చార్మినార్ స్థానంలో ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేశారు. రాజేంద్రనగర్‌లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ప్రకటించడం వల్లే చార్మినార్‌లో ముస్లిం అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది. కోదాడకు వేనపల్లి చందర్రావు, ముషీరాబాద్‌కు ముఠా గోపాల్ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించింది. అభ్యర్థుల తాజా జాబితా ఇదీ మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి, గోషామహల్ – ప్రేమ్‌సింగ్‌రాథోడ్, చార్మినార్ – మహ్మద్ సలావుద్దీన్ లోడీ, వరంగల్ తూర్పు – నన్నపునేని నరేందర్, హుజూర్నగర్ – శానంపూడి సైదిరెడ్డి, వికారాబాద్ – డాక్టర్ మెతుకు ఆనంద్, అంబర్‌పేట – కాలేరు వెంకటేశ్, మల్కాజ్గిరి – మైనంపల్లి హనుమంతరావు, చొప్పదండి – శొంకె రవిశంకర్, ఖైరతాబాద్ – దానం నాగేందర్ -
కారెక్కనున్న మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ టీడీపీకి చెందిన మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు సీహెచ్ మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధమవుతోంది. మల్లారెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఆయన సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ల పేర్లతో అనేక ఇంజనీరింగ్, మెడికల్, దంతవైద్య కళాశాలలు నిర్వహిస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారే విషయంలో తన సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఈ చర్చలు మరింత తీవ్రమైనట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున (జూన్ 2 న) ఆయన టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైట్టు సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఈ విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రముఖులతో చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. మల్లారెడ్డి తో పాటు ఆయన అనుచరులైన మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ శైలజ, కండ్లకోయ గ్రామ సర్పంచు నరేందర్ రెడ్డి, ఇతర సన్నిహితులు, ఆయా గ్రామాల సర్పంచులు ఇతర నాయకులు కూడా టీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఖాళీ కానున్న టీడీపీ ఎంపీ మల్లా రెడ్డితో కలిసి పలు మండలాలకు చెందిన నేతలు కూడా కారెక్కనుండటంతో జిల్లాలో టీడీపీ నామమాత్రంగా మిగిలిపోనుంది. పలు మండలాల్లో టీడీపీ పూర్తిగా ఖాళీకానుంది. -
మల్లారెడ్డిపై చర్యలు తీసుకోండి: వైఎస్సార్సీపీ
* కాలేజీల వివరాలు ఇవ్వలేదు * ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న సీహెచ్ మల్లారెడ్డి తనకున్న మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల సమాచారాన్ని దాచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యా దు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన తన కాలేజీల వివరాలు ఇవ్వకుండా నిబంధనలు ఉల్లంఘించారని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. మంగళవారం ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ను కలిసిన పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్, ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షుడు బి.జనక్ ప్రసాద్, లీగల్ సెల్ కన్వీనర్ సి.నాగేశ్వర్రావు ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను అందజేశారు. ఫిర్యాదులో వివరాలు..: వివిధ విద్యా సంస్థల అధినేతగా అందరికి తెలిసిన మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఆ వివరాలను వెల్లడించలేదని పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 నిబంధనల ఉల్లంఘనేనని, సమాచారాన్ని వెల్లడించకుండా దాచే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆయన 19 విద్యా సంస్థలకు వ్యవస్థాపక చైర్మన్‌గా, ఇతర హోదాల్లో ఉన్నారని పేర్కొన్నారు. అందులో 9 ఇంజనీరింగ్ కాలేజీలు, 3 ఫార్మసీ కాలేజీలు, 5 మేనేజ్మెంట్, బిజినెస్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజీ, పీజీ కాలేజీల్లో ఆయనకు భాగస్వామ్యం ఉన్నట్లు తెలిపారు. ఆయనకున్న ఈ కాలేజీల పేర్లతోపాటు వివరాలను ఫిర్యాదులో పొందుపరిచారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనపై తగిన చర్యలు చేపట్టాలని కోరారు.