సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని.. ఇవే తనకు చివరి ఎన్నికలని తెలిపారు. పార్టీ మారనున్నారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్నదంతా అసత్య ప్రచారమని అన్నారు.
కాగా మల్లారెడ్డి గురువారం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, తనయుడు భద్రారెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ మళ్లీ పుకార్లు గుప్పుమన్నాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో డీకేను కలిసినట్లు తెలిపారు. తన మిత్రుడుకి సంబంధించిన యూనివర్సిటీ కొనుగోలు కోసం మాట్లాడేందుకు మాత్రమే వెళ్ళానట్లు పేర్కొన్నారు.
ఓ మధ్యవర్తితో డీకేశివకుమార్ వద్దకు వెళ్లిన్నట్లు మల్లారెడ్డి చెప్పారు. రెండు రోజుల కింద కలిశానని.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. శివకుమార్ తనకుకు మిత్రుడని పేర్కొన్నారు. తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని.. తమ కుటుంబ సభ్యులు వేరే పార్టీల నుంచి పోటీచేయరన్నారు. ఈ ఐదేళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.
చదవండి: తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్
Comments
Please login to add a commentAdd a comment