సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడిన ఓ సంచలనమే. మల్లారెడ్డి నోటి నుంచి వచ్చే మాటలకు జనాల్లో, సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన చేసే వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలతో కొత్త చర్చకు తెరలేపారు.
మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిని తానే నిర్ణయిస్తానని, మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇప్పించింది తానేనని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించడంలో తనదే నిర్ణయాత్మక పాత్ర అని పేర్కొన్నారు.
మేడ్చల్ కాంగ్రెస్‌లో గ్రూపు గొడవల వెనుక తామే ఉన్నామని చెప్పుకొచ్చారు. గతంలో తనపై జరిగిన ఐటీ దాడుల అంశాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘‘ఐటీ అధికారులు నా ఇంట్లో డబ్బులు ఉన్న గదిని చూడలేదు. ఆ డబ్బులు ఇప్పుడు ఎన్నికలకు ఖర్చు చేస్తా..’’అని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానా, మరొకరు పోటీ చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని పేర్కొన్నారు.
చదవండి: నాలుగేళ్లుగా చేయనిది.. ఈ రెండు నెలల్లో చేస్తారా?
Comments
Please login to add a commentAdd a comment