కారెక్కనున్న మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి | Malkajgiri MP Malla reddy to Join TRS on june | Sakshi
Sakshi News home page

కారెక్కనున్న మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి

Published Mon, May 30 2016 3:35 PM | Last Updated on Mon, Oct 8 2018 8:52 PM

కారెక్కనున్న మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి - Sakshi

కారెక్కనున్న మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ టీడీపీకి చెందిన మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు సీహెచ్ మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధమవుతోంది. మల్లారెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఆయన సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ల పేర్లతో అనేక ఇంజనీరింగ్, మెడికల్, దంతవైద్య కళాశాలలు నిర్వహిస్తున్నారు.

గడిచిన కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారే విషయంలో తన సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఈ చర్చలు మరింత తీవ్రమైనట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున (జూన్ 2 న) ఆయన టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైట్టు సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఈ విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రముఖులతో చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. మల్లారెడ్డి తో పాటు ఆయన అనుచరులైన మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ శైలజ, కండ్లకోయ గ్రామ సర్పంచు నరేందర్ రెడ్డి, ఇతర సన్నిహితులు, ఆయా గ్రామాల సర్పంచులు ఇతర నాయకులు కూడా టీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది.

ఖాళీ కానున్న టీడీపీ
ఎంపీ మల్లా రెడ్డితో కలిసి పలు మండలాలకు చెందిన నేతలు కూడా కారెక్కనుండటంతో జిల్లాలో టీడీపీ నామమాత్రంగా మిగిలిపోనుంది. పలు మండలాల్లో టీడీపీ పూర్తిగా ఖాళీకానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement