సాక్షి, హైదరాబాద్: పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారడం లేదని కార్లిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మల్లారెడ్డి శుక్రవారం కలిశారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు భద్రారెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని తెలిపారు.
మల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్ ఎవరికి టికెట్. ఇచ్చిన గెలిపించుకుంటామని పేర్కొన్నారు. గురువారం సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడంపై మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాల కూల్చివేత అంశంపై కలిసినట్లు పేర్కొన్నారు. ఇదే విషయం కేసీఆర్‌ను కలిసి కూడా చెప్పినట్లు తెలిపారు. తనకు పార్టీ మారరే ఉద్ధేశ్యం లేదని చెప్పారు. సోషల్ మీడియా తమకు నచ్చినట్లు రాసుకుంటుందని, దానిని తాను పట్టించుకోనని అన్నారు.
కాగా గత నెలలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే నేడు లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని భద్రారెడ్డి కేటీఆర్‌కు తెలిపినట్లు సమాచారం.
చదవండి: మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ సర్కార్: ఎమ్మెల్సీ కవిత ఫైర్
Comments
Please login to add a commentAdd a comment