
సాక్షి, తిరుపతి: కల్కి భగవాన్ అక్రమాస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సత్యవేడు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోనేటి ఆదిమూలం డిమాండ్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అజ్ఞాతంలో ఉన్న కల్కి ఆశ్రమం వ్యవస్థాపకుడు విజయ కుమార్ నాయుడు, పద్మావతిని కస్టడీలోకి తీసుకోవాలన్నారు. ఆశ్రమం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచి పెట్టాలన్నారు. కల్కి ఆశ్రమానికి ఉన్న బినామీలు ఎవరో నిగ్గు తేల్చి నిజనిజాలు బయటపెట్టాలన్నారు. హవాలా మార్గం ద్వారా వచ్చిన విదేశీ సొమ్ము లోగుట్టు వెలికితీయాలని ఎమ్మెల్యే ఆదిమూలం కోరారు.
Comments
Please login to add a commentAdd a comment