kalki bhagwan
-
దేశం విడిచివెళ్లలేదు.. వదంతులు నమ్మవద్దు
-
అజ్ఞాతం వీడిన ‘కల్కి’ వ్యవస్థాపకులు
సాక్షి, చిత్తూరు: కల్కి ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే వారు అందుబాటులో ఉన్నారంటూ కల్కీ ఆశ్రమం మీడియాకు ఓ వీడియోను విడుదల చేసింది. తమ ఆరోగ్యం బావుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ వీడియోలో విజయ్కుమార్ దంపతులు పేర్కొన్నారు. తాము దేశం విడిచి వెళ్లిపోయానని మీడియాలో కథనాలు వస్తున్నాయని, కానీ, తాము దేశం విడిచివెళ్లలేదని, వదంతులు నమ్మవద్దని వారు కోరారు. కల్కి ఆశ్రమ ప్రధాన కార్యాలయాల్లో యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. భక్తి ముసుగులో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్కి ఆశ్రమంలో ఇటీవల జరిగిన ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నిత్యం వివాదాలకు కేంద్రంగా మారిన కల్కి ఆశ్రమంలో జరిగిన ఐటీ సోదాల్లో లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతోపాటు హైదరాబాద్లోనూ కల్కి ఆస్తులపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పెద్దసంఖ్యలో బంగారు బిస్కట్లు, ఆస్తులు, కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కల్కి ఆశ్రమంలో ముగిసిన ఐటీ సోదాలు
-
కల్కి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
సాక్షి, తిరుపతి: కల్కి భగవాన్ అక్రమాస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సత్యవేడు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోనేటి ఆదిమూలం డిమాండ్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అజ్ఞాతంలో ఉన్న కల్కి ఆశ్రమం వ్యవస్థాపకుడు విజయ కుమార్ నాయుడు, పద్మావతిని కస్టడీలోకి తీసుకోవాలన్నారు. ఆశ్రమం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచి పెట్టాలన్నారు. కల్కి ఆశ్రమానికి ఉన్న బినామీలు ఎవరో నిగ్గు తేల్చి నిజనిజాలు బయటపెట్టాలన్నారు. హవాలా మార్గం ద్వారా వచ్చిన విదేశీ సొమ్ము లోగుట్టు వెలికితీయాలని ఎమ్మెల్యే ఆదిమూలం కోరారు. -
కల్కి ట్రస్ట్ పేరు మారిందా?
-
సంపూర్ణ ఆరోగ్యంతో కల్కిభగవాన్
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ఆయన ఆశ్రమ ప్రతినిధి ఉమాపతి దాసాజీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కల్కి భగవాన్ అస్వస్థతకు గురై తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నట్లు వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం 3 రోజుల క్రితం చెన్నై అపోలో ఆస్పత్రికి భగవాన్ వెళ్లిన మాట మాత్రం వాస్తవమేనని ఆయన తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం అదే రోజు వరదయ్యపాళెం పరిధిలోని బత్తలవల్లం వద్ద ఉన్న ఆశ్రమానికి చేరుకున్నారన్నారు. ప్రస్తుతం ఆయన ఆశ్రమంలో దైనందిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారన్నారు. ఈ విషయంలో భక్తులెవ్వరూ ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.