
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: వికారుద్దీన్, అతని అనుచరుల ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో జ్యోతిరావ్ పూలే విగ్రహాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించడమే కాకుండా అవమానకర పద్ధతిలో చెత్తవాహనంలో తరలించడాన్ని సీపీఎం ఒక ప్రకటనలో ఖండించింది. ఈ చర్యకు బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.