గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో మృతి చెందుతున్న గిరిజన విద్యార్థులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు.
సిటింగ్ జడ్జితో విచారణ జరపాలి
Published Wed, Jul 27 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
డుంబ్రిగుడ: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో మృతి చెందుతున్న గిరిజన విద్యార్థులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. విశాఖలోని హాస్టల్‌లో ఉండి చదువుకుంటూ మృతి చెందిన బోయిన రాజ్‌కుమార్ కుటుంబాన్ని కురిడి గ్రామానికి వచ్చి ఆయన మంగళవారం పరామర్శించారు. గిరిజన విద్యార్థులు నిత్యం వ్యాధుల బారిన పడి మృతి చెందుతున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రాజ్‌కుమార్ కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేసియా చెల్లించాలని..తక్షణమే వారి తల్లిదండ్రులకు అందజేయాలని చెప్పారు. అధికారులు నిర్లక్ష్యంతోనే విద్యార్థులు మృతి చెందుతున్నారని అన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని.. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గిరిజన సంఘ అధ్యక్ష కార్యదర్శులు టి.సూర్యనారాయణ, పాంగి సురేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement