దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రగిల్చిన కోల్‌కతా ఆర్‌జీకార్ ఆస్పత్రిలో జరిగిన దారుణంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల ట్రాక్ రికార్డ్ చర్చాంశనీయంగా మారింది. గతంలో దేశంలో సంచలనం సృష్టించిన రెండు దారుణాల్లో నిందితుల్ని కటకటాల వెనక్కి నెట్టడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు మహిళా సీబీఐ అధికారులకు ఆర్‌జీకార్ కేసును కేంద్రం అప్పగించింది. ఇప్పుడు ఆ ఇద్దరు మహిళా అధికారుల పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగుతుంది.
సీబీఐ మహిళా అధికారుల్లో ఒకరు జార్ఖండ్‌కు 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సంపత్ మీనా గతంలో హత్రాస్, ఉన్నావ్ కేసుల్ని కొలిక్కి తెచ్చారు. హత్రాస్ కేసులో సంపత్ మీనాతో పాటు సీమా పహుజా సైతం ఉన్నారు. దర్యాప్తుతో నిందితులకు శిక్షపడేలా చేశారు. కాబట్టే కేంద్రం ప్రత్యేకంగా ఆర్‌జీ కార్ కేసును వీరికి అప్పగినట్లు సమాచారం.
సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న సంపత్ మీనా ఆర్‌జీకార్ ఆస్పత్రి కేసు దర్యాప్తు చేస్తున్న 25 మంది అధికారుల బృందానికి బాధ్యత వహిస్తున్నారు. కేసు దర్యాప్తు ఎలా జరుగుతుందో తెలుసుకునే పర్యవేక్షక బాధ్యతల్ని ఈమే చూస్తున్నారు.
మరో మహిళా సీబీఐ అధికారిణి, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీమా పహుజా సైతం 2007 నుంచి 2018 మధ్యకాలంలో పలు సంచలనాత్మక కేసుల్లో నిందితులకు శిక్షపడేలా కేసు దర్యాప్తు చేపట్టినందుకు రెండుసార్లు గోల్డ్ మెడల్ అందుకున్నారు.
2017లో హిమాచల్ ప్రదేశ్‌లో 10వ తరగతి విద్యార్ధిని కేసు, ఉన్నావ్ కేసుల్ని సంపత్ మీనాతో పాటు సీమా పహుజా ఛాలెంజింగ్ తీసుకున్నారు.
2017లో హిమాచల్ ప్రదేశ్‌లో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 10వ తరగతి విద్యార్థిని కిడ్నాప్‌కు గురైంది. రెండ్రోజుల తర్వాత శవమై కనిపించింది. నాటి విద్యార్ధినిపై జరిగిన దారుణం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేసింది.
అయితే ఏప్రిల్ 2018లో సీబీఐ అధికారిణి సీమా అహుజా కేసును ఛేదించారు. అధునాతన డీఎన్‌ఏ టెక్నాలజీని ఉపయోగించి 1000 మందికి పైగా స్థానికుల విచారణ, 250 మందికి పైగా డీఎన్‌ఏ పరీక్షల అనంతరం నిందితుడు అనిల్ కుమార్ తండ్రిలో ఫోరెన్సిక్ నమూనాలకు సరిపోలినట్లు కనుగొన్నారు. తండ్రి ఫోరెన్సిక్ నమూనాల ఆధారంగా నిందితుడు అనిల్ కుమార్‌ను గుర్తించారు. ఈ కేసులో అనిల్‌కుమార్‌కు జీవిత ఖైదు పడడంలో సీమా అహుజా సేకరించిన ఆధారాలు కీలకంగా వ్యవహరించాయి.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్‌లో 2017 జూన్ 4న 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక దురాఘతంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ దోషిగా నిర్ధారించడంలో సంపత్ మీనా, సీమా పహుజాల దర్యాప్తు తోడ్పడింది.
2020లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌లో 19 ఏళ్ల బాలికపై అగ్ర కులానికి చెందిన నలుగురు నిందితుల చేసిన దారుణంలో వారం రోజుల తర్వాత బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో మరణించారు. ఆ ఉదంతం దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దారి తీశాయి. ఈ కేసులో నిందితుల్ని గుర్తించి శిక్షపడేలా చేసిందనుకుగాను సీబీఐ అధికారులు సంపత్ మీనా, సీమా పహుజా దర్యాప్తు చేసిన తీరుపై ప్రశంశలు వెల్లువెత్తాయి.
తాజాగా ఆర్‌జీకార్ జూనియర్ డాక్టర్ కేసు దర్యాప్తు చేసేలా సీబీఐ మహిళా అధికారులైన సంపత్ మీనా,సీమా పహుజాలకు కేంద్రం అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment