సాక్షి, విశాఖపట్నం : ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని విశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన గెదేల అనిల్ కుమార్ అసిస్టెంట్ కలెక్టర్‌నంటూ ఒక ఫేక్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి అమాయకులను టార్గెట్ చేయడం ప్రారంభించాడు. ఇదివరకే భూ సెటిల్‌మెంట్‌లు చేస్తానని చెప్పి పలువురి దగ్గర సుమారు రూ. 9 లక్షలు తీసుకున్నట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో భూమి సమస్య పరిష్కరిస్తానంటూ అనిల్ నకిలీ ఐఏఎస్‌గా తనను తాను పరిచయం చేసుకొని ఓ వ్యక్తి వద్ద రూ.2.5 లక్షలు తీసుకున్నాడు. బాధితునికి అనిల్ ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనిల్ కుమార్‌ను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. (చదవండి: విశాఖ ‘సిట్’ గడువు పెంపు)
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. ఒకరి అరెస్ట్
ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న శ్రీకాకులపు శ్రీనివాస్ అనే వ్యక్తిని త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ కంపెనీలో ఏజీఎంగా ఉద్యోగం ఇప్పిస్తానని మభ్యపెట్టి ఓ వ్యక్తి నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఫిర్యాదు రావడంతో పోలీసులు ఈ మేరకు చర్య తీసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే మల్కాపురంతో పాటు విజయనగరం జిల్లా గరివిడి, విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లలోనూ చీటింగ్ కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment