సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 81,193 కరోనా పరీక్షలు నిర్వహించగా, 357 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,56,455కి చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. గురువారం ఒకరు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,865కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 405 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,46,344కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,246 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment