ఉదయగిరి, న్యూస్‌లైన్: ఉదయగిరి ఎంపీడీఓ బండారు శ్రీనివాసరావును డిస్మిస్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. సస్పెన్షన్ తాలూకు ఆదేశాలను బుధవారం ఆ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచారు.
జెడ్‌పీ సీ ఈఓ జితేంద్ర ఈ విషయాన్ని ధ్రువీక రించారు. శ్రీనివాసరావు గుంటూరు జి ల్లాలో ఎంపీడీఓగా పనిచేస్తున్నప్పుడు ‘ఉపాధి’ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రూ.కోటికి పైగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువు కావడంతో ప్రస్తుతం వేటు పడింది. 2013 మేలో ఆయన ఉదయగిరి ఎంపీడీఓగా కౌన్సెలింగ్ ద్వారా విధుల్లో చేరారు.
ఉదయగిరిలోనూ అక్రమాలు
ఉదయగిరిలోనూ భారీ ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. మండల పరిషత్ సాధారణ నిధులు, సీఎఫ్‌సీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా డ్రాచేసి సొంతానికి వినియోగించుకున్నారు.
చెరువుపల్లి, గండిపాళెం, ఉదయగిరి, శకునాలపల్లి పంచాయతీల్లో తమ అనుచరులకు పనులు అప్పగించారు. వీరు తమ సొంత నిధులతో పనులు చేసి ఎంబుక్‌లో రికార్డ్ చేయించుకున్నారు. అంతకుముందే ఎంపీడీఓ సాధారణ నిధుల నుంచి రూ.10 లక్షలు, టీఎఫ్‌సీ నిధుల నుంచి రూ.1.50 లక్షలు పైగా నిధులు డ్రా చేశారు. నిబంధనల మేరకు పని పూర్తిచేసిన తర్వాతే బిల్లులు మంజూ రు చేయాలి.
గత ఏడాది జూన్ 4 నుంచి డి సెంబరు వరకు సాధారణ నిధుల నుంచి రూ.10 లక్షలు, సెప్టెంబరులో టీఎఫ్‌సీ నుంచి రూ.2.50 లక్షలు నిధు లు డ్రా చేశారనే ఆరోపణలున్నాయి.
ఉదయగిరి ఎంపీడీఓ డిస్మిస్
Published Thu, Feb 6 2014 3:11 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement