గురజాల నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాన్ని విస్మరించి అరాచకాలకు, అక్రమాలకు, దందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్తతలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు.
దాచేపల్లి: గురజాల నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాన్ని విస్మరించి అరాచకాలకు, అక్రమాలకు, దందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్తతలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని యరపతినేని భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి నియోజకవర్గంలో నిరంకుశ పాలనకు తెరలేపి, లీజులో ఉన్న మైనింగ్ భూములతో పాటు ప్రభుత్వానికి చెందిన భూముల్లోనూ అక్రమ మైనింగ్ చేస్తున్నారని, నెలకు కోట్లాదిరూపాయలను అక్రమంగా ఆర్జించి, సర్కారు ఆదాయానికి గండికొడుతున్నారని విమర్శించారు.
పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో ఉన్న క్వారీల్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎమ్మెల్యే తన సొంత మనుషులతో క్వారీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ట్రాక్టర్‌కు రూ.400 వరకు వసూలు చేస్తూ అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచారని మండిపడ్డారు. ముగ్గుమిల్లు వ్యాపారులను బెదిరించి లక్షలాది రూపాయలు తీసుకున్నారన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇన్ని అక్రమాలకు పాల్పడుతూ చిన్నవయసులోనే రాష్ట్రంలోని కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి యరపతినేనికి లేదని పేర్కొన్నారు. సరస్వతి సిమెంట్స్ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే వ్యక్తిగత స్వార్ధం కోసమే రాజకీయం చేస్తున్నారని అంబుజా, సంఘీసిమెంట్స్ గురించి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్, దాచేపల్లి జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కమిటీసభ్యుడు పేరుపోగు రాజశేఖర్, బీసీసెల్ రాష్ర్టకమిటీసభ్యుడు కుందుర్తి గురవాచారి తదితరులున్నారు.