
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావుకు ఆశీర్వచనం చేస్తున్న ఆచార్యులు
యాదగిరిగుట్ట: కరోనా ఫోర్త్ వేవ్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. శనివారం ఆయన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వయంభూలకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఫోర్త్ వేవ్‌కు సంబంధించి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. ఇప్పటికే పరీక్షలు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో 100శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయిందని, హైబ్రిడ్ ఇమ్యూనిటీ కూడా వచ్చినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment