సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కరోనా విషయంలో కాస్త మెరుగ్గా ఉందని.. మహారాష్ట్ర, కర్నాటకలాంటి రాష్ట్రాల కంటే మన రాష్ట్రం పరిస్థితి బాగుందని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మంది మాస్కులు ధరిస్తున్నారని చెప్పారు. వందేళ్లకోసారి ఇలాంటి విపత్తులు వస్తాయని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాబోయే 3,4 వారాలు చాలా కీలకం..జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
కరోనా వైరస్‌పై హైదరాబాద్‌లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియాలో డైరెక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడారు. పెళ్లిళ్ల సీజన్ ముందుంది కాబట్టి ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 45 లక్షల మంది పైగా వాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. విడతలవారీగా మిగతావారికి కూడా వాక్సిన్ వేయిస్తామని చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ గురించి ఆందోళన కూడా అవసరం లేదని భరోసా ఇచ్చారు. లక్షణాలు ఉంటేనే కోవిడ్ ఉన్నట్టని, భయంతో పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరొద్దని తెలిపారు. లక్షణాలు ఉన్నవారు పరీక్షలకు దూరం అవుతున్నారు..కోవిడ్ లేని వారు పరీక్షల కోసం వచ్చి వ్యాధి తెచ్చుకుంటున్నారని వివరించారు. లక్షణాలు కేవలం రెండు మూడు రోజులు ఉంటాయని, తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 80 శాతం మందికి ఆస్పత్రులు అవసరం లేదని.. చాలా వరకు ఇంట్లో వైద్యుల సలహాలతో కోలుకోవచ్చని డైరెక్టర్ శ్రీనివాసరావు గుర్తుచేశారు.
చదవండి: ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,500 కి.మీ జర్నీ
చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె: కేంద్రమంత్రి వ్యాఖ్యలు
రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త
Published Wed, Apr 28 2021 7:39 PM | Last Updated on Wed, Apr 28 2021 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment