ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుని వారం రోజులు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించాలని రాష్ట్రపోలీస్‌శాఖను విజయవాడ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. నిందితుడికి వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే ఎన్‌ఐఏకు అప్పగించాలని, ప్రతి మూడు రోజులకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది.