
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు ఎన్‌ఐఏ కోర్డులో హాజరుపరిచారు. విచారణలో భాగంగా రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్ జ్యూడిషీయల్ రిమాండ్ ఇవాల్టితో ముగియనున్న విషయం తెలిసిందే. తనకు ఆరోగ్యం సరిగా లేదని, చికిత్సం కోసం బెయిల్ మంజూరు చేయాలని శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. లేఖ ద్వారా న్యాయమూర్తికి బెయిల్ పిటిషన్‌పై గతంలోనే విన్నవించిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్‌పై కోర్టు నేడు తుది నిర్ణయం తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment