గుంటూరు రూరల్: రౌడీషీటర్ దారుణహత్యకు గురైన సంఘటన గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుతోట శ్మశా నం వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసరావుతోట ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ కుంచాల దుర్గాచంద్రరావు(32) మూడునెలలుగా చెన్నైలో నివాసం ఉంటున్నా డు.
నాలుగేళ్ల క్రితం మహిళ అత్యాచారం కేసుకు సంబంధించి ఈ నెల 11వతేదీ కోర్టు వాయిదా ఉన్నందున అంతకుముం దురోజు గుంటూరు వచ్చాడు. గతంలో దుర్గాచంద్రరావు.. తన అత్త బండి లక్ష్మికి కేవీపీ కాలనీలో ఉన్న రెండు నివాస స్థలాలను ఆక్రమించేందుకు యత్నించాడు. ఈక్రమంలో అత్త ను, పెద్దబావమరిది నాగును హతమార్చాలని పథకం పన్నా డు. వరుసకు తమ్ముడైన ఆలకంటి సతీష్‌పైనా దాడిచేశాడు. అప్పటినుంచి రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి.
ఈ క్రమంలో దుర్గాచంద్రరావును తుదముట్టిస్తే తమ వారికి హాని ఉండదని చిన్నబావమరిది బండి దుర్గారావు సతీష్‌ను కలుపుకొని హత్యకు పథకం పన్నాడు. ఈనెల 10న దుర్గాచంద్రరావు గుంటూరు వస్తున్నట్లు సమాచారం అందడంతో పథకాన్ని అమలుపర్చారు. శనివారం అర్ధరాత్రి దుర్గాచంద్రరావును సతీష్ నమ్మకంగా చుట్టుగుంట సెంటర్‌లోని కావేరి బార్‌కు తీసుకువెళ్లి ఇద్దరూ మద్యం తాగారు.
అనంతరం రెండు బీరు బాటిళ్లు కొనుగోలు చేసిన సతీష్.. శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు సమీపంలోని శ్శశానం వద్ద ఉన్న ఓ పాకలోకి దుర్గాచంద్రరావును తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న బండి దుర్గారావు వేటకత్తితో దాడిచేశాడు. సతీష్ కూడా వేట కత్తితీయడంతో ఇద్దరూ దుర్గాచంద్రరావును హత్య చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెస్ట్ డీఎస్పీ టీవీ నాగరాజు, నగరంపాలెం సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. హతుడికి భార్య, ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు.
హతుడిపై పలు కేసులు...
హతుడు దుర్గాచంద్రరావుపై పలు కేసులు ఉన్నాయి. గతేడాది జూన్‌లో శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు సమీపంలోని శ్శశానం వద్దే రౌడీషీటర్ మల్లిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు. నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో రౌడీషీటు ఉంది. పలు వివాదాల్లోనూ కేసులు ఉన్నట్లు తెలిసింది.
గుంటూరులో రౌడీషీటర్ హత్య
Published Mon, Jul 14 2014 12:41 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement