
హత్యకు గురైన న్యూడిల్స్ శ్రీను (ఫైల్) కొడుకు హత్యకు గురవడంతో రోదిస్తున్న తల్లి
విశాఖపట్నం, చోడవరం: చోడవరం పట్టణ శివారుల్లో ఇనుపరాడ్లతో కొట్టి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. జనసంచారం ఉన్న ప్రదేశంలోనే దుండగులు దాడి చేసి హత్య చేయడంతో ఒక్క సారిగా పట్టణం ఉలిక్కి పడింది. మంగళవారం రాత్రి 8గంటల సమయంలో ఇక్కడి ద్వారకానగర్‌లో చోడవరానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మండేల శ్రీనువాసరావు (45) హత్యకు గురయ్యాడు. న్యూడిల్స్ శ్రీనుగా పట్టణ, మండల ప్రజలకు సుపరిచితుడైన ఈయన ద్వారకానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈయన పట్టణంలో మరో ఇల్లు కూడా ఉంది. తన ఇంటికి బంధువులు రావడంతో ద్వారకానగర్ ఇంటి నుంచి దుప్పట్లు తీసుకొని తన రెండో భార్య పద్మావతితో కలిసి పట్టణంలో ఉన్న ఇంటికి వస్తుండగా బయలుదేరిన ఇంటి సమీపంలోనే దుండగులు మాటువేసి ఒక్కసారిగా ఇనుప రాడ్లతో దాడి చేసినట్టు అతని భార్య పద్మావతి చెప్పారు.
శ్రీను నల్లటి దుస్తులు ముఖం నుంచి కింద వరకు ధరించిన ఇద్దరు వ్యక్తులు.. వీరువెళ్తున్న మోటా రు సైకిల్‌కు ఎదురుగా వచ్చి ఆకస్మాత్తుగా దా డికి దిగారు. వారిని భార్య,భర్తలిద్దరూ వారించేలోగా దుండుగులు దాడికి తెబడడంతో పద్మావతి కేకలు వేస్తూ పక్కవారిని పిలవడానికి పరుగులు తీశారు. అంతలోనే శ్రీను తలపై ఇనుపరాడ్లతో దాడి చేసి తలపగలగొట్టడంతో అక్కడిక్కడకే మృతిచెందారు. స్థానికులు వచ్చేలోగానే హంతకులు అక్కడ నుంచి పరారయ్యారు. దుండగులు మోటారు సైకిల్‌పై వచ్చారు. జనం సంచారం ఉండే ప్రదేశం, అది కూడా కేవలం 8గంటల సమయంలోనే దాడికి తెగబడి హత్యచేయడంతో ఒక్కసారిగా ఈ ప్రాంత ప్రజలను ఉలిక్కిపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు అక్కడకు చేరుకొని హత్య ఎవరు చేశారనే విషయమై ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీలో చోడవరం పట్టణ అధ్యక్షుడిగా ఉన్న శ్రీను ఇటీవల ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. చిన్నవ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న శ్రీనుపై ఎవరు కక్షపెట్టుకొని హత్యచేశారనేది సర్వత్రా నెలకొన్న ప్రశ్న. చోడవరం ఎస్‌ఐ లక్ష్మణమూర్తి, ఇన్‌చార్జి సీఐ శ్రీనువాçసరావు సంఘటనా స్థలానికి చేరుకొని హత్య కు సంబంధించి వివరాలు సేకరిస్తున్నా రు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అతని భార్య పద్మావతి తోపాటు కుటుంబసభ్యులను,స్థానికులు విచా రిస్తున్నారు.డాగ్‌స్వే్కడ్‌నురంగంలోకి దింపారు.
ఆరు నెలల్లో రెండు హత్యలు
గడిచిన అర్నెళ్లలో ఇది రెండో హత్య. ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే చోడవరం పట్టణంలో గడిచిన ఐదేళ్లలో నేరాలు బాగా పెరిగాయి. గత ఏడాది నవంబరు నెలలో చోడవరం కోట వీధికి చెందిన పద్మావతి అనే బాలికను అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి పెట్రోల్‌పోసి కాల్చి హత్యచేశారు. ఆ హత్యకూడా ఇదే ద్వారకానగర్ శివార్లలోనే జరిగింది. ఇప్పుడు న్యూడిల్స్ శ్రీను హత్య కూడా ఇదే ప్రదేశంలో జరగడంతో చోడవరం పట్టణంతోపాటు పరిసర లక్ష్మీపురం,ఇతర గ్రామాల ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో తరుచూ పెట్రోలింగ్ నిర్వహించవలసిన పోలీసులు నామమాత్రంగానే వ్యవహరిస్తుండడంతో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నేరాలను అదుపుచేయడానికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలకు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment