తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు | Sensational comments of Health Director Over touching CM KCR feet | Sakshi
Sakshi News home page

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

Published Sun, Nov 20 2022 7:07 PM | Last Updated on Sun, Nov 20 2022 7:28 PM

Sensational comments of Health Director Over touching CM KCR feet - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి. శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాకు పితృ సామానులని ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆదివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కడాన్ని సమర్థించుకున్నారు. ఒక్కసారి కాదు వందసార్లు బరాబర్‌ మొక్కుతానని అన్నారు. ఒక వ్యక్తి సేవ చేయడానికి వస్తే ఆ వక్తిని ఎలా బలహీన పరచాలి? ఎలా దూరంచేయాలి? అనే కుట్రలు చేస్తున్నారంటూ ఆయనను నెగెటివ్‌ ప్రచారం చేస్తున్న వారిపై కామెంట్స్ చేశారు. 

ఇదిలా ఉంటే, ఇటీవల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమిషం వ్యవధిలోనే డీహెచ్‌ రెండు సార్లు కేసీఆర్‌కు పాదాభివందనం చేసిన వీడియో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

చదవండి: (కేసీఆర్‌ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి.. ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసమేనా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement