
సుభాష్ పాండే, ఛత్తీస్‌ఘర్ హెల్త్ జాయింట్ డైరెక్టర్
రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘడ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ సుభాష్ పాడే బుధవారం కరోనా వైరస్‌తో మృతి చెందారు. కాగా మార్చి నెలాఖరున ఆయన కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఆయనకు దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో మూడు రోజుల క్రితం రాయ్‌పూర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే మంగళవారం రాత్రి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం.. ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించగా బుధవారం కన్నుమూశారు.కాగా ఏడాది కిందట కరోనా బారిన పడిన సుభాష్ పాండే హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకొని కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. దేశంలో రోజుకో కొత్త రికార్డుతో బెంబేలెత్తిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. గడచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే మరణాల సంఖ్య 1038గా నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య1.40 కోట్లను దాటేసింది. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,73,123కి చేరింది.
చదవండి: ముంబై: మళ్లీ తెరపైకి రైల్వేకోచ్‌లు
Comments
Please login to add a commentAdd a comment