సాక్షి, కొత్తగూడెం: జిల్లాలోని కొత్తగూడెం క్లబ్‌లో డాక్టర్ జీఆర్‌ఎస్ ట్రస్ట్ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి హాజరైన వారిని ఉద్ధేశిస్తూ మాట్లాడుతూ.. కేసీఆర్ ఆదేశిస్తే ప్రజల కోరిక మేరకు రానున్న రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొంది కొత్తగూడెం వాసులు కోరుకున్నది నెరవేరుస్తానని అన్నారు.
డీహెచ్‌కు ముషీరాబాద్ సీటు ఖరారైందని వస్తున్న వార్తలు అవాస్తవమని, కొంతమంది కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోటీచేస్తే కొత్తగూడెంలోనే పోటీ చేస్తానని లేకపోతే లేదని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బీఎస్‌ఆర్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని.. ఇక్కడే పుట్టిన నేను ఈ గడ్డమీదే చనిపోతానని, ఇక్కడే నా ఆఖరి మజిలీ అని అన్నారు.
చదవండి: డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్
ఇంకా ఏడేళ్లు సర్వీస్ ఉన్నా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని రాజకీయాల్లోకి వస్తున్నా. కానీ ఆస్తులు పోగేసుకోవడానికో, కీర్తులు గడించడానికో రావట్లేదు.. నాకు ఒక కూతురు మాత్రమే ఉంది. ఇప్పుడు తన భాద్యత కూడా తీరిపోయింది ఇక మిగిలింది నా కొత్తగూడెం కుటుంబం బాధ్యత మాత్రమే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనరల్ కేటగిరి ఉన్నది కేవలం మూడు స్థానాలే. వాటిలో ఒక స్థానం ఒక వర్గం, మరొక స్థానం మరొక వర్గం వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడే పుట్టిన, ఇక్కడే చనిపోతా.. కొత్తగూడెంపై
ఇక మిగిలిన కొత్తగూడెం నియోజకవర్గం బీసీల అడ్డా. ఇక్కడైనా బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే కేటాయించాలి. నా గురించి ఎందరో ఎన్నో మాటలను మాట్లాడుతున్నారు. శనివారం వస్తారు, సోమవారం వెళ్తారని అంటున్నారు. ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా. హైదరాబాద్ వెళ్ళేది కేవలం శరీరం మాత్రమమే.. నా మనసు ఇక్కడే మీ చుట్టూ ఉంటుంది. నాకు మిగిలిన ఈ జీవితం నా జన్మ భూమి అయిన కొత్తగూడెంనకు మాత్రమే’నని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment