మెర్రీ క్రిస్మస్ | Merry Christmas | Sakshi
Sakshi News home page

మెర్రీ క్రిస్మస్

Published Thu, Dec 25 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

Merry Christmas

 ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తగా క్రైస్తవులు గురువారం క్రిస్మస్‌ను  ఘనంగా జరుపుకోనున్నారు. జిల్లాలోనూ ఈ పండగను ఘనంగా జరుపుకునేందుకు చర్చి  లను తీర్చిదిద్దారు. బుధవారం రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు. 12 గంటలు  దాటినా తరువాత హ్యాపీ క్రిస్మస్ అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలిపారు. నగరంతో  పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ తదితర ప్రాంతాల్లోని చర్చిలను ముస్తాబు  చేశారు. నగరంలోని సీఎస్‌ఐ చర్చిలో యేసుక్రీస్తు జన్మదినాన్ని గుర్తు చేస్తూ అందంగా పశు  వుల పాకను తీర్చిదిద్దారు. చర్చిల్లో బెలూన్లు, రంగు రంగుల కాగితాలతో పాటు క్రిస్మస్ ట్రీ,  శాంతాక్లాజ్ తాత నమూనా చిత్రాలు ప్రదర్శించారు. క్రైస్తవుల ఇళ్లలోను స్టార్లు వెలిశాయి. అలాగే సీక్యాంప్ మందిరం, స్టాంటన్ మెమోరియల్ చర్చి, గిప్సన్ చర్చి, రాక్‌వుడ్ చర్చి, యేరుషలేమ్, సీసీ చర్చి, బిషప్ చర్చిలు విద్యుత్ దీపాలంకరణతో వెలుగు
 లీనుతున్నాయి.   
 - కర్నూలు హాస్పిటల్
 
 చర్చీలకు కేకులు పంపిణీ చేసిన
 భారతి సిమెంట్స్
 
 కర్నూలు (ఓల్డ్‌సిటీ): భారతి సిమెంట్స్ యాజమాన్యం.. బుధవారం నగరంలోని ప్రముఖ చర్చీలకు భారీ కేకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఉర్దూ ట్రైనింగ్ స్కూల్ రోడ్డులోని సీఎస్‌ఐ చర్చి నుంచి ప్రారంభించారు. భారతి సిమెంట్స్ ఏరియా సేల్స్ మేనేజర్ ఎ.విజయభాస్కర్ చేతుల మీదుగా కేక్‌ను అందజేశారు. అనంతరం పాస్టర్ బి.ఎస్.వేదనాయకం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సర్వమానవాళి సుఖ శాంతులతో వర్ధిల్లాలంటూ ఆ ఏసు కృప అందరిపై ఉండాలని దీవెనలు అందించారు. ఏటా క్రిస్మస్ పండుగకు కేకులు పంపడం ఆనవాయితీగా చేసుకున్న భారతి సిమెంట్స్ వారిని అభినందిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సేల్స్‌మేనేజర్ విజయభాస్కర్ మాట్లాడుతూ.. తమ సంస్థ వినియోగదారులకు మూడు రెట్లు మెరుగైన సిమెంట్ అందిస్తుందన్నారు. భారతి సిమెంట్స్ తరఫున క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.  కార్యక్రమంలో డాక్టర్ టి.ఎస్.వేదనాయకం, ఎం.ఎస్.జాన్సన్‌బాబు, జార్జిరాజు, జాన్ చంద్రమోహన్, సుధీర్, జయకుమార్, సుశీల పాల్గొన్నారు.
 
 నేడు ఆరాధన
 గురువారం ఉదయం క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.  పాస్టర్లు దైవ సందేశం అందిస్తారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జైలు, అనాథాశ్రమాలు, శిశుభవన్‌లు, వృద్ధాశ్రమాలు, పాఠశాలల్లో వస్త్రదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement