ఐపీఎల్: జెర్సీ ఒకరిది.. ఆటగాడు ఒకరు | IPL: Daniel Christian reveals why he wore Ben Stokes jersey | Sakshi
Sakshi News home page

ఐపీఎల్: జెర్సీ ఒకరిది.. ఆటగాడు ఒకరు

Published Thu, May 4 2017 6:54 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

ఐపీఎల్: జెర్సీ ఒకరిది.. ఆటగాడు ఒకరు

ఐపీఎల్: జెర్సీ ఒకరిది.. ఆటగాడు ఒకరు

కోల్ కతా: ఈడెన్ గార్డెన్ లో రైజింగ్ పుణే, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. చివరి ఓవర్లో సిక్స్ కొట్టి గెలిపించిన పుణే ఆటగాడు డాన్ క్రిస్టియన్ ఓ తప్పిదం చేశాడు. ధోని అవుట్ అయిన అనంతరం క్రీజులోకి వచ్చిన ఈ ఆస్ట్రేలియా ఆటగాడు తన జెర్సీ కి బదులు 55 నెంబర్ గల బెన్ స్టోక్స్ జెర్సీ ధరించి బ్యాటింగ్ కు దిగాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై క్రిస్టియన్ స్పందించాడు.

'ఈ రాత్రి ఇది ఒక గొప్ప విజయం. త్రిపాఠి బ్రిలియంట్. జెర్సీ ఉతకడానికి వెళ్లోచ్చిన సమయంలో స్టోక్సీ, నా జెర్సీలు తారుమారయ్యాయి, నేనే తప్పుగా స్టోక్స్ జెర్సీ తీసుకున్నాను' అని క్రిస్టియన్ ట్వీట్ చేశాడు. ఈ ఘటనతో క్రిస్టియన్ క్రికెట్ నియమ నిబంధనలను ఉల్లంఘించనట్లైంది. రిఫరీలు తీవ్రంగా పరిగణిస్తే అతను ఒక మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ లో పుణే కోల్ కతా పై 4 వికెట్ల తేడాతో నెగ్గి ఫ్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకుంది. ఇక మే 4 క్రిస్టియన్ జన్మదినం కావడంతో  సహచరులతో బర్త్ డే సంబరాలు జరుపుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement