క్రిస్టియన్ వదిలినా.. ధోని వదలడు | MS dhoni took a catch on rebound from Christian | Sakshi
Sakshi News home page

క్రిస్టియన్ వదిలినా.. ధోని వదలడు

Published Sun, May 14 2017 6:08 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

క్రిస్టియన్ వదిలినా.. ధోని వదలడు

క్రిస్టియన్ వదిలినా.. ధోని వదలడు

పుణె: ఐపీఎల్-10లో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత రైజింగ్ పుణె వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని అద్భుత కీపింగ్ తో అదరగొడుతున్నాడు. గత మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు శ్యామ్యుల్స్ ను రెప్పపాటులో స్టంప్ అవుట్ చేసి ఔరా అనిపించుకున్నధోని,  తాజా కింగ్స్ పంజాబ్ మ్యాచ్ లో ఓ క్యాచ్ ను అద్భుతంగా పట్టి ఆశ్చర్య పరిచాడు.. ఉనద్కత్ వేసిన 13 ఓవర్ నాలుగో బంతికి స్వప్నిల్ సింగ్ స్లిప్ లో ఉన్న క్రిస్టియన్ కు క్యాచ్ ఇవ్వగా బంతి అతని వేళ్లకు తగిలి పైకి లేచింది. వెంటనే అప్రమత్తమైన ధోని బంతిని అందుకున్నాడు.

'నీవు వదిలినా నేను వదలను' అన్నట్లు ధోని పట్టిన క్యాచ్ ను చూసిన వారంతా హతాశులయ్యారు. ఇక బెంగళూరు మ్యాచ్ లో డివిలియర్స్ ను స్టంప్ అవుట్ చేసిన విధానం కూడా కీపింగ్ లో ధోనికి ఎవరూ సాటిలేరని  నిరూపించింది. ఇలా ఈ సీజన్ లో అంతగా బ్యాట్ ఝులిపించకపోయినా తన కీపింగ్ తో మాత్రం అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ లో 100 మంది అవుట్ చేసిన ఘనతను అందుకున్న ధోని వికెట్ల వెనుకాల చిరుతలా కదులుతూ ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement