ధోనిని పొగడ్తలతో ముంచిన స్మిత్
ధోనిని పొగడ్తలతో ముంచిన స్మిత్
Published Wed, May 17 2017 4:48 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM
ముంబై: రైజింగ్ పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ భారత మాజీ కెప్టెన్, రైజింగ్ పుణె కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని పొగడ్తలతో ముంచెత్తాడు. ధోని ధనాధన్ షాట్ లతో ముంబై ఇండియన్స్ పై రైజింగ్ పుణె 20 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ధోని 26 బంతుల్లో 40 పరుగులు చేయడంతో జట్టు 162 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన స్మిత్ మహీ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. వాంఖేడే పిచ్ ను బౌలింగ్ పిచ్ గా పరిగణించామని, దీనికి కావల్సిన పరుగులను చివర్లో మనోజ్, మహీ రాబట్టారన్నాడు. పిచ్ మందకోడిగా ఉందని. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న కూడా మహీ పరుగుల రాబట్టడాని స్మిత్ కొనియాడాడు. అజింక్యా రహానే జట్టుకు శుభారంబాన్ని అందించడం కూడా జట్టు విజయానికి కలిసొచ్చిందని స్మిత్ తెలిపాడు.
అయితే పుణె 18 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలింది. మెక్లిన్ గన్ వేసిన19 ఓవర్లో మనోజ్ తివారీ నో బాల్ ను బౌండరీకి బాది, ఆతరువాతి ఫ్రీ హిట్ బంతిని సిక్సర్ గా మలిచాడు. అనంతరం సింగిల్ తీయడంతో స్ట్రైకింగ్ వచ్చిన ధోని సిక్సర్లతో విరుచుకుపడటంతో పుణె ఈ ఓవర్లో 26 పరుగులు పిండుకుంది. ఇక చివరి ఓవర్ చివరి బంతికి మనోజ్ తివారీ రనౌట్ అయినా ముంబై జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ధోని రెండు సిక్స్ లు బాదడంతో పుణెకు 15 పరుగులు చేరాయి.
Advertisement