ఇరాక్ లో బయటపడ్డ పురాతన క్రైస్తవ క్షేత్రం!
ఉగ్ర భూతం కోరలు చాచిన యుద్ధభూమిలో చారిత్రక క్రైస్తవ క్షేత్ర మూలాలు వెలుగు చూశాయి. ఐఎస్ ఐస్ ఆక్రమిత ఇరాక్ మోసుల్ నగర శివార్లలో వందల ఏళ్ళనాటి పురాతన కట్టడాలు బయట పడినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. డైర్ మార్ ఎలియా గా పిలిచే ఆ ప్రాంతం ఇప్పుడు వందల ఏళ్ళ చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది. తుపాకులు, బాంబుల మోతలతో దద్దరిల్లుతున్న మోసుల్ నగర శివార్లలో బయటపడ్డ చారిత్రక అవశేషాలు.. అక్కడో క్రైస్తవ క్షేత్రం ఉండేదని నిరూపిస్తున్నాయి.
భూమినుంచీ బయటపడ్డ ఆ పురాతన నిర్మాణాలు సుమారు పథ్నాలుగు వందల ఏళ్ళ క్రితం నాటివిగా శాటిలెట్ చిత్రాలద్వారా తెలుస్తోంది. సెయింట్ ఎలిజా గా పిలిచే ఆ నిర్మాణ ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన 'ఆల్ సోర్స్ అనాలసిస్' నిపుణల విశ్లేషణల ప్రకారం ఆ భారీ కట్టడాలు సహజంగానే కూలిపోయినట్లు తెలుస్తుండగా... ఆ కూల్చివేత ఉద్దేశ్య పూర్వకంగానే జరిగిందని మరి కొందరు నిపుణులు సూచిస్తున్నారు.
2014 సంవత్సరంలో ఆప్రాంతాన్ని పరిశీలించేందుకు ముందు, తర్వాత చిత్రాలను చూస్తే తెరమరుగైన చారిత్రక విషయాలెన్నో వెల్లడయ్యాయి. అప్పట్లో రాళ్ళు, ఇసుకతో ఆ నిర్మాణాలను చేపట్టినట్లుగా ఆల్ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. అక్కడ మనం ఎప్పుడూ చూడని సుమారు ఇరవై వెలకట్టలేని గొప్ప భవనాలు ఉండేవని, అవి యుద్ధసమయంలో నాశనమైనట్లు విశ్లేషణలు చెప్తున్నాయి. అయితే రెండోసారి తీసిన ఉపగ్రహ చిత్రాల్లో పరిశీలిస్తే ఆ భవనాలు అప్పట్లో బుల్డౌజర్ తో కూల్చివేసినట్లు కొన్ని ఆధారాలు తెలుపుతున్నాయి.
కాగా ఐఎస్ ఐఎస్ ఈ కూల్చివేతలకు కారణంగా సూచించలేమని ఆల్ సోర్సెస్ చెప్తోంది. కాగా ఐఎస్ ఐఎస్ తీవ్రవాదులు మోసుల్ నగరాన్నిస్వాధీనం చేసుకున్న2014 జూన్ కు కొద్ది నెలల తరువాత అంటే సుమారు ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ మొదట్లో ఈ నాశనం జరిగి ఉండొచ్చని ఇమేజరీ పిన్ పాయింట్ విశ్లేషణలు తెలుపుతున్నాయి.