Monastery
-
ఆమె చనిపోయి నాలుగేళ్లైంది..ఐనా మృతదేహం కించెత్తు పాడవ్వకుండా..
ఎవ్వరైన చనిపోతే వారివారి మత ఆచారాలను బట్టి అంత్యక్రియలు జరుగుతుంటాయి. ఖననం చేస్తే కొన్ని నెలల్లోనే కుళ్లిపోయి కేవలం అస్థిపంజరాలు మాత్రమే ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. ఐతే ఇక్కడోక ఆఫ్రికన్ మహిళ చనిపోయి నాలుగేళ్లైంది. కొన్ని కారణాల రీత్యా ఆమె శవపేటికను వెలికి తీయగా..ఆ మహిళ మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు కుటుంబసభ్యులు, బంధువులు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే...సదరు మహిళ సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ ఆఫ్రికన్ అమెరికన్. ఆమె అమెరికాలో బెన్డిక్ట్ ఇన్ సిస్టర్స్ ఆఫ్ మేరి(నన్స్ ఆశ్రమం) వ్యవస్థాపకురాలు. అక్కడ ఆమె నన్‌గా ఎంతో సామాజిక సేవ చేసింది. అయితే ఆమె 2019లో చనిపోయింది. అక్కడే ఆ ఆశ్రమం సమీపంలో ఖననం చేశారు. ఐతే ఆ ఆశ్రమంలోని కొందరూ ఆమె సమాధి పాడవ్వడంతో ఆమె అవశేషాలను వేరోచేటికి తరలించి సమాధి కట్టించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆమె శవపేటికను వేలికి తీశారు. అందులో ఆమె మృతదేహం చూసి ఒక్కసారిగా అవాక్యయ్యారు అక్కడున్నవారంతా. కనీసం ఎలాంటి దుర్వాసన గానీ రాకుండా తాజా మృతదేహంలా అలా చెక్కు చెదరకుండా ఉంది. వాస్తవానికి తాము ఎముకలు మాత్రమే ఉంటాయని భావించామని చెబుతున్నారు ఆమె సంబంధికులు, స్నేహితులు. కనీసం ఆమె మృతదేహం పాడవ్వకుండా ఎలాంటి లేపనాలు పూయకుండా సాధారణ మనిషి మాదిరే ఖననం చేశామని చెబుతున్నారు. పగిలిన శవపేటికలో ఓ తేలికిపాటి మెత్తని పొరలాంటి గుడ్డలో చుట్టబడి, పాడవ్వకుండా ఉన్నా ఆమె మృతదేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో సదరు ప్రాంతంలోని ప్రజలు ఆమె మృతదేహాన్ని చూసేందుకు ఆ బెనెడిక్టైన్ ఆశ్రమానికి తండోపతండోలుగా తరలి వచ్చారు. ఆమె నెక్కు ధరించే బెల్ట్ మాదిరి క్లాత్, తలకు ధరించిన క్లాత్ మాత్రమే పాడైయినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. నెలల తరబడి ఆమె శరీరీం పాక్షికంగా పాడైన చెక్క శవ పేటికలో ఉండి.. సూర్యరశ్మీ, వర్షాలకు ఎక్స్పోజ్ అయినా ఏ మాత్రం కుళ్లకుండా అలా ఉండటం అత్యంత విచిత్రం అంటున్నారు బంధువులు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని మరోక చోటికి తరలించి సమాధి చేయనున్నట్లు తెలిపారు ఆమె తల్లి సిసిలియా. ఇది దేవుడి పట్ల ఆమెకి ఉన్న భక్తి విశ్వాసం, నిస్వార్థపూరిత సేవకు భగవంతుడిచ్చిన వరం కాబోలు అని ఆ నన్తో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు మృతురాలి తల్లి, బంధువులు. (చదవండి: US: మితిమీరిన స్వేచ్ఛ+ పతనమైన కుటుంబ వ్యవస్థ = మానసిక ఉన్మాదులు) -
మూగజీవాల రక్షకుడు.. 8వేల కుక్కలను కాపాడిన భిక్షువు..
ఈయన పేరు హి జియాంగ్. చైనా షాంఘై నగరంలోని పురాతన బౌద్ధ మఠంలో ప్రధాన భిక్షువు. అంతే కాదు.. చైనాలో మూగజీవాలకు ఈయన దేవుడు. ఆయన చేతుల్లో ఉన్న కుక్కపిల్ల రోడ్డుపై దొరికినదే. దానిని సంరక్షించి, అమెరికాలోని ఓ వ్యక్తికి దత్తత ఇచ్చారు. ఆయనే స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చి దానిని సాగనంపారు. ఆ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. జంతువులంటే ఆయనకి అంత ప్రీతి. 51 ఏళ్ల జియాంగ్ చైనాలోని వేలాది మూగ జీవాలకు సంరక్షకుడు. ఇందుకోసం తన మఠంలోనే మూగ జీవాల సంరక్షణాలయం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ రకాల జంతువులను, పక్షులను, వీధి శునకాలు వేలాదిగా ఉన్నాయి. శునకాలే 8 వేలు ఉన్నాయి. ఆయనే స్వయంగా వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఒక్కోసారి పశువైద్యుడి అవతారం ఎత్తి ఆ మూగ జీవాలకు వ్యాక్సిన్లు కూడా వేస్తుంటారు. ఇన్ని వేల మూగజీవాలను సంరక్షించడం ప్రపంచంలోనే చాలా అరుదు. చదవండి: స్నేక్ అటెంప్ట్ మర్డర్ అంటే ఇదేనేమో? మొదట్లో ఆయన ప్రమాదాల్లో గాయపడ్డ మూగజీవాలకు వైద్య చికిత్స చేయించేవారు. 1994 నుంచి వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రెండేళ్ల క్రితం చైనాలో సుమారు 5 కోట్ల మూగ జీవాలు వీధుల్లో ఉన్నాయని అంచనా. వీటి సంఖ్య ఏటా పెరుగుతోంది. ‘‘చైనా ప్రజలకు ఆదాయం పెరిగింది కానీ, మూగజీవాలను పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. అందుకే వారు తమ పెంపుడు జంతువులను వీధుల్లో వదిలేస్తున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలకు కొత్త జీవితం షాంఘై పోలీసులు ఇటీవల ఇరుకుగా ఉన్న బోనుల్లో కొన్ని వీధి కుక్కలను బంధించి ఉంచారు. వాటిలో 20 వరకూ పిల్లలు కూడా ఉన్నాయి. ఈ విషయం జియాంగ్ చెవిన పడింది. వెంటనే ఆయన అక్కడకు చేరుకున్నారు. పోలీసులతో మాట్లాడారు. కొద్ది సమయంలో ఆ శునకాలకు బోనుల నుంచి విముక్తి లభించింది. వాటిని తీసుకుని జియాంగ్ తన సంరక్షణాలయానికి చేరుకున్నారు. ఆ శునకాల్లో గాయపడ్డ వాటికి, జబ్బుతో ఇబ్బంది పడ్డవాటికి సపర్యలు చేశారు. ప్రేమగా లాలించారు. వాటిని రక్షించి కొత్త జీవితాన్ని ఇచ్చారు. జీవుల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. ‘‘నేను వాటిని రక్షించక పోతే.. అవి చనిపోయి ఉండేవి’’ అని జియాంగ్ చెబుతారు. అప్పు చేసి ఆహారం కుక్కలతో పాటు పిల్లులు, కోళ్లు, బాతులు, నెమళ్లు కూడా జియాంగ్ మఠంలో ఆశ్రయం పొందుతున్నాయి. వీటన్నిటికీ ఆహారం పెట్టాలంటే ఓ భిక్షువుకు తలకు మించిన భారమే అవుతుంది. ఏటా వీటి ఆహారానికి సుమారు 14 కోట్ల రూపాయలు ఖర్చవుతోందట. ప్రభుత్వం నుంచి ఆయనకు ఏమాత్రం సహకారం అందదు. చందాలతోనూ, అప్పులతోనూ ఇప్పటి వరకూ నెట్టుకొచ్చారు. అయితే ఇకపై అప్పు పుట్టే పరిస్థితి లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఆయన ఇతర దేశాల్లోని సంరక్షకుల వద్దకు, దత్తత తీసుకునే వారికి ఆ శునకాలను ఆయన ఇచ్చేస్తున్నారు. ఇంగ్లీషు తెలిసిన తన వాలంటీర్లతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలకు సుమారు 300 కుక్కలను పంపారు. అలా పంపడం తనకు ఇష్టం లేదని, అయితే వాటికి కొత్త జీవితాలను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నానని ఆయన తెలిపారు. ఏదొక రోజు వెళ్లి వాటిని చూసి వస్తానని చెబుతున్నారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ -
మఠంలో రహస్య గది: బయటపడ్డ వెండి ఇటుకలు
సాక్షి, భువనేశ్వర్/పూరీ: పూరీలోని ఎమ్మార్ మఠం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సుమారు 11 ఏళ్ల తర్వాత ఈ మఠంలో అత్యంత అమూల్యమైన ప్రాచీన సొత్తు నిక్షిప్తంగా ఉందనే నమ్మకం సర్వత్రా బలపడింది. ఈ మఠానికి గతంలో ఉన్న మహంత ఆధిపత్యం రద్దు చేసి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు బాధ్యతల స్వీకరణ పురస్కరించుకుని మఠంలో వెలుగు చూస్తున్న సొత్తుపట్ల అంతా అవాక్కవుతున్నారు. అయితే ఈ సొత్తు లోగడ ఖరారు చేసిన జాబితాలో ఉన్నదీ లేనిదీ స్పష్టం కావలసి ఉంది. ట్రస్టు బాధ్యతల స్వీకరణలో భాగంగా శనివారం మఠం 4వ నంబరు గది తెరవడంతో ప్రాచీన కాంస్య ఆవు, దూడ విగ్రహం బయటపడింది. దీంతో పాటు 16 పురాతన కత్తులు, వెండి ఇటుకలు, ఆభరణాలు, వంటపాత్రలు బయటపడ్డాయి. ఆవు దూడ కాంస్య విగ్రహం ఝులన్ జాతర (డోలోత్సవం)లో వినియోగించి ఉంటారని భావిస్తున్నారు. ట్రస్టుకు బాధ్యతలు ఎమ్మార్ మఠం బాధ్యతలు ట్రస్టు బోర్డుకు అప్పగించారు. ఉత్తర పార్శ్వ మఠం మహంత నారాయణ రామానుజ దాస్, జగన్నాథ సంస్కృతి ప్రచారకులు నరేష్ చంద్ర దాస్, సంఘసేవకులు ప్రతిమ మిశ్రా, ప్రముఖ న్యాయవాది బొనొ బిహారి నాయక్, సిటీ డీఎస్పీతో కొత్త ట్రస్టు బోర్డు ఏర్పాటైంది. ఈ బోర్డు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మఠంలో ఒక్కో గది తెరిచి చూడబోతే అమూల్యమైన సంపద, సొత్తు బయటపడుతోంది. ఇంతకు ముందు 2011వ సంవత్సరంలో 522 వెండి ఇటుకలు వెలుగు చూసిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. అది మొదలుకొని మఠంలో అత్యంత అమూల్యమైన రత్నవైడూర్యాలు వగైరా నిక్షిప్త నిధి ఉండి ఉంటుందనే ఊహాగానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రాచీన మఠంగా గుర్తింపు శ్రీ మందిరం పరిసరాల్లో అత్యంత పురాతనమైనదిగా ఎమ్మార్ మఠం పేరొందింది. 12వ శతాబ్దంలో సంత్ రామానుజాచార్య ఆగమనం పురస్కరించుకుని ఎమ్మార్ మఠం నిర్మితమైనట్లు పరిశోధకుల అంచనా. జగన్నాథుని సంస్కృతి సంప్రదాయాలు, నైవేద్యాలు, ప్రసాదాల పరంపరతో ముడిపడిన మఠంగా ప్రాచుర్యం సంతరించుకుంది. శ్రీ మందిరం నలు వైపుల ఆధునికీకరణ పురస్కరించుకుని ఈ మఠం తొలగించేందుకు పూరీ జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. 2019వ సంవత్సరంలో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక తొలగింపు పనుల్లో రహస్య గదుల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ గదుల్లో గుప్తనిధి ఉండవచ్చన్న అనుమానాలు బలపడ్డాయి. 1866వ సంవత్సరంలో సంభవించిన కరువు కాటకాల సమయంలో ఈ మఠం ప్రజలకు భోజనాదులు అందజేసి అక్కున చేర్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వందలాది సంవత్సరాలు ఈ మఠం ఎందరో సాధుసంతువులు, భక్తులు, బీదాబిక్కి ప్రజలకు నిరవధికంగా అన్న సంతర్పణ చేసినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. మెజిస్ట్రేట్ సమక్షంలో గాలింపు మెజిస్ట్రేట్, పోలీసుల సమక్షంలో ట్రస్టు బోర్డు సభ్యులు ఈ గాలింపు చర్యలు చేపడుతున్నారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టరు, ట్రస్టు సభ్యుల సమక్షంలో ఎమ్మార్ మఠం సొత్తు జాబితా తయారవుతోంది. ఇప్పటి వరకు 3 గదులు తెరిచి గాలింపు ముగించారు. మరో 50 పైబడి ఇటువంటి గదులు ఉన్నట్లు భావిస్తున్నారు. శనివారం నిర్వహించిన గాలింపులో తొలుత 8, తదుపరి 37 వెండి ఇటుకలు బయటపడినట్లు అనధికారిక సమాచారం. కాంట్రాక్టర్ చేతివాటం మఠంలోని 2 గదుల మరమ్మతు కోసం 2011లో పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో చెక్కపెట్టెల్లో 522 వెండి ఇటుకలు లభించాయి. మరమ్మతు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఈ సొత్తును దొంగతనంగా కటక్ నగరంలో విక్రయించడంతో ఢెంకనాల్‌కు తరలిపోయింది. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఢెంకనాల్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి పూరీ సింహద్వారం స్టేషన్ పోలీసులు ఈ వెండి ఇటుకల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మఠం నిర్వాహకుడు మహంత రాజగోపాల్‌తో పాటు ఆయన అనుచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వెండి ఇటుకలను జిల్లా పోలీసు ఆయుధాగారంలో భద్రపరిచారు. చదవండి: జనగామ: బయటపడ్డ లంకె బిందె.. బంగారం, వెండి లభ్యం! -
వైరల్: పాములకు ఆశ్రయం కల్పిస్తోన్న బౌద్ధ సన్యాసి
వన్యప్రాణులను అక్రమంగా విక్రయించడంలో మయన్మార్ ప్రపంచంలోనే కేంద్ర బిందువుగా మారింది. స్థానికంగా ఉండే పాములను పట్టుకొని తరచుగా పొరుగు దేశాలైన చైనా, థాయ్‌లాండ్‌కు అక్రమంగా రవాణా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మయన్మార్‌లోని యాంగోన్లో ఓ బౌద్ధ సన్యాసి వివిధ రకాల పాములకు ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఓ ఆశ్రమాన్ని ఎంచుకొని కొన్ని వేల జాతుల పాములకు అక్కడ రక్షణ కల్పిస్తున్నారు. ఈ క్రమంలో పాములతో బౌద్ధ సన్యాసి దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. విలాతా(69) అనే బౌద్ధ సన్యాసి సీక్తా తుఖా టెటూ ఆశ్రమంలో కొండ చిలువ, త్రాచుపాము, వైపర్లు వంటి సరీసృపాలకు ఆశ్రయం కల్పించి వాటిని రక్షిస్తున్నారు. ఇలా పాములకు ఆశ్రయం కల్పించడం దాదాపు అయిదేళ్ల క్రితమే ప్రారంభమైంది. చదవండి: కుక్కపిల్ల కోసం కొండచిలువతో పోరాటం ఈ మేరకు బౌద్ధ సన్యాసి మాట్లాడుతూ.. పాములను వ్యాపారంగా భావించి అమ్మడం, చంపేయండం చూసి చలించిపోయిన తను వెంటనే వాటికి వ్యాపారుల నుంచి రక్షణ అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. స్థానికులుతోపాటు, ప్రభుత్వ సంస్థలు వివిధ చోట్ల బంధించిన పాములను సన్యాసి వద్దకు తీసుకువస్తారని ఆయన పేర్కొన్నారు. వాటి సంరక్షణ, బాగోగులు చూసి పాములు తిరిగి అడవికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు భావించే వరకు ఆశ్రయంలో ఉంచి వాటికి భ్రదత కల్పిస్తానని తెలిపారు. ఇటీవల విలాతా అనేక రకాల పాములను హ్లావ్గా నేషనల్ పార్క్‌లో విడిచి వచ్చినట్లు వెల్లడించారు. అలా పాములు స్వేచ్చగా అడవిలోకి వెళ్లడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అయితే మళ్లీ వాటిని ప్రజలు పట్టుకొని అమ్మేందుకు ప్రయత్నిస్తే ఆందోళన చెందుతానని అన్నారు. కాగా సన్యాసి రక్షిస్తున్న పాములకు ఆహారం అందించేందుకు ఇవ్వడానికి సుమారు 300 డాలర్లు విరాళాలు అసవరం అవుతున్నాయని తెలిపారు. చదవండి: 37 ఏళ్లలో 37 సార్లు పాము కాటు! -
గోవిందా..హుండీ సొమ్ము మాదంటే మాది!
అహోబిలంలో మఠం, దేవదాయ ధర్మదాయ శాఖల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నో ఏళ్లుగా మఠం, దేవదాయ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పాలనపై మఠం వర్గాలకు నచ్చలేదు. తమ పాలన తామే చేసుకుంటామని కోర్టును ఆశ్రయించడమే గాకుండా రాష్ట్రస్థాయి అధికారులను ఒప్పించి తమకు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అవసరం లేదని ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో దేవదాయ శాఖ ఉన్నతాధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు స్టేటస్ కో ఉత్తర్వులను (ఇప్పుడు ఎలా ఉంటే అలాగే పరిపాలన కొనసాగించుకోండి) కోర్టు ఇచ్చింది. ఇలా మూడు నెలలకు పైగా రెండు వర్గాలు ఎత్తులకు, పై ఎత్తులు వేస్తుండటంతో అంతర్గతపోరు తారాస్థాయికి చేరింది. సాక్షి, ఆళ్లగడ్డ(కర్నూలు) : అహోబిల క్షేత్రంలో వివాదాలు ముదురుతున్నాయి. మఠం, దేవదాయ ధర్మదాయ శాఖ.. పాలన తమేదనంటూ కోర్టును అశ్రయించారు. ప్రస్తుతం పాలన వ్యవహారాలను మఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల చర్యలతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేటస్ కో పై ఎవరి వాదన వారిదే.. కోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో గతంలో ఇక్కడ ఈఓ పరిపాలన ఎలా ఉందో అలా చేసుకోమనే ఇచ్చిందని.. మఠం వారు అడ్డుకుంటున్నారని ఈఓ వాదిస్తుండగా, కాదు స్టేటస్ కో ఇచ్చేటప్పటికి (ఆరోజుకు) ఎలా ఉందో అలానే పరిపాలన కొనసాగించుకోవాలని ఇచ్చిందని దీంతో స్టే ఇచ్చే రోజుకు ఈఓ పరిపాలన లేదని న్యాయస్థానంలో సమస్య పరిష్కారమయ్యే వరకు అలానే కొనసాగిస్తామని మఠం ప్రతినిధులు చెబుతున్నారు. తారాస్థాయికి చేరుకున్న కుమ్ములాటలు.. మొన్నటి వరకు దేవస్థాన, మఠం వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కుమ్ములాటలు తాజాగా దేవుడి హుండీ సొమ్ములు బ్యాంకులో జమ చేసే విషయంలో ఇరు వర్గాలు బుధవారం రాత్రి రోడ్డెక్కాయి. రెండు రోజుల పాటు నవనారసింహ క్షేత్రాల్లో హుండీ సొమ్ముల లెక్కింపు చేపట్టారు. లెక్కించిన నగదు దిగువ అహోబిలం బ్యాంక్ అధికారులు అక్కడికే వచ్చి ఖాతాలో జమ చేసుకుంటారు. ఈ క్రమంలో జమ చేసుకునేందుకు వచ్చిన బ్యాంక్ అధికారులు నగదును అహోబిల మఠం ఆధ్వర్యంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఖాతాలో జమ చేసుకుంటుండగా.. అందులో ఎలా జమ చేస్తారు.. ఈఓ ఆధ్వర్యంలోని దేవస్థాన ఖాతాలో జమ చేయాలని ఈఓ మల్లికార్జున ప్రసాద్ అడ్డుతగిలారు. దీంతో మఠం మేనేజర్ స్పందిస్తూ..కాదు తమ ఖాతాలోనే జమ చేయాలని సూచించారు. దీంతో కొంత సేపు వాదోపవాదనలు చోటుచేసుకున్నాయి. ఏం చేయాలో దిక్కుతెలియని బ్యాంక్ అధికారులు, పెద్ద మనుషుల సూచనల మేరకు సస్పెన్స్ ఖాతా తెరిచి జమ చేశారు. గతంలో కూడా ఈఓ ఆధ్వర్యంలో ఎగువ అహోబిలంలో నిత్యన్నదాన సత్రం ప్రారంభించగా తమ అనుమతి లేకుండా ఎలా ప్రారంభిస్తారని.. అన్నప్రసాద సత్రానికి సరుకులు ఇవ్వద్దని మఠం ప్రతినిధులు ఆదేశించడంతో ఈఓ భక్తుల సహాయంతో సత్రం నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న ఈఓ కొందరు తాత్కలిక సిబ్బందిని నియమించారు. తమను సంప్రదించకుండా ఎలా ఉద్యోగాలిస్తారని, వారికి తామెందుకు వేతనాలివ్వాలని మఠం ప్రతినిధులు వేతనాలు నిలిపివేశారు. అనంతపురం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా కబ్జాలో ఉన్న మాన్యంను వేలం వేసేందుకు సిబ్బందిని కారులో పంపగా.. అందుకయ్యే ఖర్చులను తాము ఇవ్వమని తెగేసి చెప్పారు. ఇలా రోజుకో ఘటనతో నిత్యం ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మఠం ఆధ్వర్యంలోనే పాలన.. గతంలో పనిచేసిన ఈఓ చేసిన అక్రమాలను, స్వామి సొమ్ములు దుర్వినియోగం చేసిన వైనం.. ఆమె కొనసాగించిన నిర్లక్ష్య పాలనతో పాటు దేవస్థాన ఈఓగా ఉంటూ జైలుకు వెళ్లిన ఘటనలను మఠం ప్రతినిధులు ఉన్నతస్థాయి అధికారులకు వివరించడంలో సఫలీ కృతులయ్యారు. ఇదే సాకుగా చూపి దేవస్థాన పరువు, ఆదాయం రెండూ పోతున్నాయని ఉన్నతస్థాయి నుంచి సిఫారసు చేయించుకొని ఈఓను బదీలీ చేయించి పరిపాలనను చేతిలోకి తీసుకొని మేనేజర్‌ను నియమించారు. ప్రస్తుతం పాలన మొత్తం మఠం ఆధ్వర్యంలోనే ఉంది. ఎప్పటిలాగే జమ చేయమని చెప్పాం మఠం ఖాతాలో జమ చేయమని చెప్పలేదు. పూర్వం నుంచి ఎలా జమ చేస్తున్నారో అలానే దేవస్థానం ఖాతకు జమ చేయమని చెప్పాం. ఈ ఖాతా ఆళ్లగడ్డలో ఆంధ్రాబ్యాంక్ ప్రారంభమైనప్పటి నుంచి ఉంది. ఈ ఖాతాలో ఉన్న సొమ్మును ఎవరు పడితే వారు తీయడానికి ఉండదు. మఠం పీఠాధిపతికి మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని అవకతవకలు జరగడంతో ఈఓ అకౌంట్ రద్దు చేయించాం. – బద్రీనారాయణ్, అహోబిల మఠం మేనేజర్ 1961 నుంచి తమ పాలన ఉంది 1961నుంచి అహోబిలంలో దేవదాయ ధర్మదాయ శాఖ పరిపాలన కొనసాగుతోంది. మరి ఇప్పుడు ఎందుకు తమ పాలన ఎందుకు వద్దంటున్నారో అర్థం కావడంలేదు. ప్రస్తుతానికి హుండీ ఆదాయం సస్పెన్సన్ అకౌంట్లో జమ చేశారు. ప్రస్తుతం హుండీ లెక్కింపు సొమ్మును తమ ఖాతాలో జమ కాకుండా చేయడం సరికాదు. – మల్లికార్జున ప్రసాద్, ఈఓ -
తిరుమలలో కూలిన నూతనంగా నిర్మిస్తున్న మఠం
-
ఇరాక్ లో బయటపడ్డ పురాతన క్రైస్తవ క్షేత్రం!
ఉగ్ర భూతం కోరలు చాచిన యుద్ధభూమిలో చారిత్రక క్రైస్తవ క్షేత్ర మూలాలు వెలుగు చూశాయి. ఐఎస్ ఐస్ ఆక్రమిత ఇరాక్ మోసుల్ నగర శివార్లలో వందల ఏళ్ళనాటి పురాతన కట్టడాలు బయట పడినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. డైర్ మార్ ఎలియా గా పిలిచే ఆ ప్రాంతం ఇప్పుడు వందల ఏళ్ళ చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది. తుపాకులు, బాంబుల మోతలతో దద్దరిల్లుతున్న మోసుల్ నగర శివార్లలో బయటపడ్డ చారిత్రక అవశేషాలు.. అక్కడో క్రైస్తవ క్షేత్రం ఉండేదని నిరూపిస్తున్నాయి. భూమినుంచీ బయటపడ్డ ఆ పురాతన నిర్మాణాలు సుమారు పథ్నాలుగు వందల ఏళ్ళ క్రితం నాటివిగా శాటిలెట్ చిత్రాలద్వారా తెలుస్తోంది. సెయింట్ ఎలిజా గా పిలిచే ఆ నిర్మాణ ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన 'ఆల్ సోర్స్ అనాలసిస్' నిపుణల విశ్లేషణల ప్రకారం ఆ భారీ కట్టడాలు సహజంగానే కూలిపోయినట్లు తెలుస్తుండగా... ఆ కూల్చివేత ఉద్దేశ్య పూర్వకంగానే జరిగిందని మరి కొందరు నిపుణులు సూచిస్తున్నారు. 2014 సంవత్సరంలో ఆప్రాంతాన్ని పరిశీలించేందుకు ముందు, తర్వాత చిత్రాలను చూస్తే తెరమరుగైన చారిత్రక విషయాలెన్నో వెల్లడయ్యాయి. అప్పట్లో రాళ్ళు, ఇసుకతో ఆ నిర్మాణాలను చేపట్టినట్లుగా ఆల్ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. అక్కడ మనం ఎప్పుడూ చూడని సుమారు ఇరవై వెలకట్టలేని గొప్ప భవనాలు ఉండేవని, అవి యుద్ధసమయంలో నాశనమైనట్లు విశ్లేషణలు చెప్తున్నాయి. అయితే రెండోసారి తీసిన ఉపగ్రహ చిత్రాల్లో పరిశీలిస్తే ఆ భవనాలు అప్పట్లో బుల్డౌజర్ తో కూల్చివేసినట్లు కొన్ని ఆధారాలు తెలుపుతున్నాయి. కాగా ఐఎస్ ఐఎస్ ఈ కూల్చివేతలకు కారణంగా సూచించలేమని ఆల్ సోర్సెస్ చెప్తోంది. కాగా ఐఎస్ ఐఎస్ తీవ్రవాదులు మోసుల్ నగరాన్నిస్వాధీనం చేసుకున్న2014 జూన్ కు కొద్ది నెలల తరువాత అంటే సుమారు ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ మొదట్లో ఈ నాశనం జరిగి ఉండొచ్చని ఇమేజరీ పిన్ పాయింట్ విశ్లేషణలు తెలుపుతున్నాయి. -
చారిత్రక సమాహారం.. బౌద్ధారామం
దక్షిణభారతదేశంలో విశిష్టత వున్న బౌద్ధారామంగా గుర్తించబడిన బొజ్జన్నకొండపై కనుమ పండగనాడు తీర్థం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బౌద్ధమేళాతో మొదలయ్యే ఈ తీర్థానికి గ్రామీణ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రంగు రంగుల పతంగులు, రంగుల రాట్నాలు, నోరూరించే పంచదార చిలుకలు, గుమ గుమలాడే తినుబండారాలు, చిన్నారులు ఇష్టపడే ఆటవస్తువులు, కనువిందు చేసే బుద్ధుని గుహలు ఇలా ఎన్నో చారిత్రక విశిష్టతలు ఈ తీర్థం సొంతం. అనకాపల్లి రేపు బొజ్జన్న కొండపై తీర్థం... ఏర్పాట్లు పూర్తి ఇలా వెలుగులోకి... రెండు దశాబ్దాల చరిత్ర వున్న బొజ్జన్నకొండ 1906లో అలగ్జాండర్ రిమ్ నివేదికతో వెలుగులోకి వచ్చింది. ఇక్కడి పురాతనమైన కట్టడాలు ఎక్కడా లేవని ప్రముఖ చరిత్రకారుడు రాళ్లబండి సుబ్బారావు పేర్కొన్నారు. వడ్డాదిని రాజధానిగా చేసుకొని పరిసర ప్రాంతాలను పాలించిన అర్జునదేవుడు అవసానదశలో ఈ బొజ్జన్నక్షేత్రంలో నివసించారని చరిత్ర చెబుతోంది. క్వారీ పేలుళ్లతో ముప్పు అనకాపల్లి బొజ్జన్నకొండకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలు ఒక వైపు ఉండగా, మార్టూరు సమీపంలోని క్వారీ పేలుళ్ల వల్ల ఇక్కడి శిలా సంపదకు ముప్పు నెలకొంది. బొజ్జన్నకొండపైన దంగోడు గొయ్యిలో రాయివేస్తే మేలు జరుగుతుందని సందర్శకుల విశ్వాసం. వీరంతా చేతికందిన ప్రతిరాయిని దంగోడు గొయ్యిలో వేయడం వల్ల నష్టం జరుగుతోంది. లింగాల మెట్టపై... బుద్ధుని కొండ పక్కనే ఉన్న లింగాల మెట్టపైకూడా అనేకమైన చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి. అనేకమైన చైత్యాలతో కూడిన లింగాలమెట్టనే లింగాల కొండగా పిలుస్తున్నారు.లింగాలకొండ మత్స్య ఆకారంలో కనిపించడం మరో విశేషం. దీనిని నమూనాగా తీసుకొని జావా ద్వీపంలో ‘బోరోబూదూరు’ బౌద్ధక్షేత్ర నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు.{పాధాన్యమున్న బొజ్జన్నకొండను వీక్షించేందుకు, బౌద్ధమేళాలో పాల్గొనేందుకు రష్యా, జపాన్, చైనా, నేపాల్, బర్మా తదితర దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు వస్తుంటారు. ర్యాలీతో ప్రారంభమై... కనుమ రోజున ఉదయం పదిగంటలకు నిర్వహించే సమాజ శాంతి ర్యాలీలో బౌద్ధభిక్షవులు పాల్గొంటారు. పదిన్నర గంటలకు బౌద్ద ప్రధాన గుహలో బుద్ధ వందనం, చైత్యవందనం, 12 గంటలకు కొండ దిగువున బౌద్ధమేళా సభను నిర్వహిస్తారు.బౌద్ధ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను విక్రయిస్తారు. బౌద్ద గేయాలాపన, పలు తీర్మానాలు చేస్తారు. విశాఖజిల్లా మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రాచీన కట్టడంగా గుర్తించినా... హామీలు గాలికి... గతంలో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పాలకులు ఇచ్చిన హామీలు అమలు కావడంలేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు అనేక సార్లు బొజ్జన్న కొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వాగ్ధానాలు చేశారు. అయినప్పటికీ బొజ్జన్న కొండ అభివృద్ధిలో ఏ మాత్రం ముందడుగు పడలేదు. బొజ్జన్న కొండను చేరుకునేందుకు రెండు మార్గాలు ఉండగా, శంకరం వైపు రహదారిని మాత్రమే పక్కాగా వేశారు. తుమ్మపాల వైపు నుంచి వేలాది మంది వచ్చేవారు ఏలేరు కాలువ పక్కనుంచి గోతుల రహదారిలో రావాల్సి ఉంది. ఈ రహదారికి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సైతం హామీ ఇచ్చినా ఇంకా మోక్షం కలగలేదు. పురావస్తు శాఖ నిబంధనలే చిక్కు... బొజ్జన్న కొండను జాతీయ ప్రాధాన్యం కలిగిన స్మారకంగా, ప్రాచీన కట్టడంగా పురావస్తు క్షేత్రాలు, శిథిల అవశేషాల పరిరక్షణ చట్టం 1958 ద్వారా గుర్తించింది. పురావస్తు చట్టం సవరించిన 2010 అధికరణం 30(1) ప్రకారం బొజ్జన్న కొండ పరిసరాలను నిషేధిత , క్రమబద్ధీకరించిన ప్రాంతాలుగా గుర్తించారు. వీటిలో ఎటువంటి నిర్మాణాలు, తవ్వకాలు చేపట్టరాదు. క్రమబద్ధీకరించిన ప్రాంతం, సరిహద్దుకు 100 మీటర్ల దూరంలో పురావస్తు శాఖ అధికారుల అనుమతి తీసుకొని మాత్ర మే కార్యక్రమాలు నిర్వహించాలి. గత ఏడాది బొజ్జన్న కొండ ప్రాంతంలో బౌద్ధ మేళాకు టెంట్ కూడా వేయనీయకపోవడంతో బౌద్ధులు ఇబ్బందులు పడ్డారు. దిల్లీ స్థాయిలోనే అనుమతి పొందాలి బొజ్జన్నకొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి నిర్మాణాలు, కట్టడాలు చేపట్టరాదు. కొద్ది నెలల క్రితం రెవెన్యూ శాఖ అధికారులు సర్వే నిమిత్తం రాగా పై అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించాం. పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలంటే దిల్లీ స్థాయిలోని ఆర్కియాలజీ డెరైక్టర్ అనుమతి తీసుకోవాలి. - లోవరాజు, మల్టీ టాస్క్ స్టాఫ్, బొజ్జన్నకొండ విశేషాలెన్నో... సుమారు 23 ఎకరాల్లో విస్తరించి ఉన్న బొజ్జన్న, లింగాల కొండల్లో ఎన్నో విశేషాలు దాగి వున్నాయి.కొండ దిగువున ‘ హారతి’ అనే బౌద్ధ స్త్రీ మూర్తి శిల్పం ఉండేది. వీరశైవుల ప్రభావంతో మతవిద్వేశంతో ఆ స్త్రీమూర్తి విగ్రహాన్ని పిల్లల్ని హరించే రాకాసిగా చిత్రీకరించి రాళ్లతో కొట్టేవారు. ఈ శిల్పానికి నష్టం వాటిల్లడంతో పురావస్తు శాఖ వారు మ్యూజియంలో భద్రపరిచారు. మతవిద్వేశాలతో ఇక్కడి శిల్ప సంపదకు నష్టం జరిగింది. బొజ్జన్నకొండపై రెండు వరుసల్లో ఆరు గుహల్లో బౌద్ధ శిల్పాలు ఉండేవి. ఇక్కడి బుద్ధుని విగ్రహం శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఎంతో రమణీయంగా కనిపిస్తుంది.30 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు గల గుహాలయాన్ని 16 స్తంభాలపై నిర్మించారు. నాలుగు అడుగుల ఏకశిలా నిర్మితమైన స్థూపం కొండ మధ్య భాగంలో ఉంటుంది. దీనిని అశోకుని శిలాశాసనంగా చరిత్రకారులు భావిస్తుంటారు. ఈ స్థూపానికి తూర్పుదిశగా మహావిహారం ఉంది. ఇపుడు అది మట్టి దిబ్బగా కనిపిస్తున్నప్పటికీ కిందిభాగాన్ని చూడవచ్చు. ఈ విహారానికి చుట్టూ ఉన్న గదుల్లో దీపప్రమిదలు, ధ్యాన సామగ్రి అమర్చే అరలు ఉన్నాయి.