టీ20 ప్రపంచకప్-2022కు ముందు నెదర్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు సలహాదారులుగా టీమిండియా మాజీ కోచ్, దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డేన్ క్రిస్టియన్‌ను నెదర్లాండ్ క్రికెట్ నియమించింది. కాగా నెదర్లాండ్స్ ఆటగాళ్ళు ఆస్ట్రేలియాకు వెళ్లేముందు కేప్ టౌన్‌లోని గ్యారీ కిర్‌స్టన్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందారు.
ఈ క్రమంలో మళ్లీ అతడు జట్టుతో సలహారుడిగా జతకట్టనున్నాడు. అదే విధంగా ఆడిలైడ్‌లో నెదార్లాండ్ ట్రైనింగ్ క్యాంప్‌లో జట్టుతో క్రిస్టియన్ కలవనున్నాడు. వీరిద్దరూ నెదర్లాండ్ హెడ్ కోచ్ ర్యాన్ కూక్‌తో కలిసి పనిచేయనున్నారు. "టీ20 ప్రపంచకప్ కోసం మా జట్టు కోచింగ్ స్టాప్‌లో గ్యారీ కిర్‌స్టన్, డాన్ క్రిస్టియన్ చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది.
వారి అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను" అని నెదర్లాండ్ క్రికెట్ బోర్డు హై పెర్ఫార్మెన్స్ మేనేజర్ రోలాండ్ లెఫెబ్రే పేర్కొన్నారు. కాగా కిర్‌స్టన్ 2011లో వన్డే వరల్డ్‌కప్ సొంతం చేసుకున్న భారత జట్టు హెడ్ కోచ్‌గా కిర్‌స్టన్ పనిచేశాడు. ఇక నెదర్లాండ్ ఈ మెగా ఈవెంట్‌లో తొలుత క్వాలిఫియర్ మ్యాచ్‌లు ఆడనుంది. డచ్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్16న యూఏఈతో తలపడనుంది.
చదవండి: R Ashwin Vs Ramiz Raja: పీసీబీ చైర్మన్ రమీజ్ రాజాకు అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment