‘ప్రజలకిచ్చిన మాట కోసం.. తండ్రి ఆశయ సాధన కోసం.. ఎన్ని కష్టాలెదురైనా వెనుదిరగని జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచ్చీలత రుజువైంది. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని కుతంత్రాలు చేసినా.. ధర్మ పీఠం ముందు నిలబడవని మరోసారి రుజువైంది. కోట్లాది ప్రజల అభిమానం.. ఎందరో ఆత్మీయుల దీవెనల ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. మా రాజన్న బిడ్డ మా మధ్యకు ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్న మాకు కోర్టు తీర్పుతో పండగొచ్చింది’ ‘పశ్చిమ’ ప్రజలు ఉద్వేగంతో చెప్పిన మాటలివి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెరుుల్ మంజూరైందన్న విషయం తెలియగానే పట్టరాని సంతోషంతా జనమంతా రోడ్లపైకి వచ్చారు. సంబరాలు చేసుకున్నారు. ఇన్నాళ్లూ ఆవేదనతో కన్నీరొలికిన వారి కళ్లు ఆనంద బాష్పాలతో తడిశాయి. ‘జయహో జగన్’ నినాదాల నడుమ ఊరూవాడా సంబరాలు మిన్నంటాయి.
సాక్షి, ఏలూరు :
జననేత.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెరుుల్ మంజూరైన విష యం తెలియగానే జిల్లా ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. బాణసంచా కాల్చారు. స్వీట్లు పం చారు. వాహనాల్లో వెళుతున్న వారు సైతం ఎక్కడికక్కడ ప్రజలతో కలిసి పండగ చేసుకున్నారు. న్యాయమే గెలిచిందంటూ నినాదాలు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటీషన్‌పై తీర్పు వెలువడనుందన్న సమాచారంతో సోమవారం ఉదయం ఆయన అభిమానులు పలు ప్రాంతాల్లో పూజలు చేశారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మకు పానకాలు పోశారు. కుల, మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు పూజలు, ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పెదపాడు మండలం అప్పనవీడులో అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. మధ్యాహ్నం నుంచి ప్రజలు టీవీ లకు అతుక్కుపోయారు. అనుక్షణం ఉత్కంఠకు లోనయ్యారు.
సాయంత్రం 5 గంటల సమయంలో ఆయనకు బెయిల్ మంజూరైందన సమాచారం తెలుసుకుని హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లవద్ద పం డగ వాతావరణం నెలకొంది. వైసీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జీలుగుమిల్లి జగదాంబ ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. బెయిల్ సమాచారం తెలియగానే నాయకులు ఒకొరినొకరు అలిం గనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో కేక్‌కట్ చేసి కార్యకర్తలు, అభిమానులకు పంచారు. వైఎస్ నిలువెత్తు విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, నాయకులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. నరసాపురం పట్టణం బాణసంచా కాల్పులతో దద్దరిల్లిపోయింది. వేలాది మంది బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని వేడుక చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును అభినందలతో ముంచెత్తారు. భుజాలపై ఎత్తుకుని ఊరేగించారు. భీమవరం పట్టణంలో పెద్దఎత్తున వేడుకలు చేశారు. పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వచ్చీపోయేవారికి స్వీట్లు పంచిపెట్టి ఆనందం పంచుకున్నారు.
ఆచంటలో మాజీ ఎమ్మెల్యే మోచర్ల జోహార్‌వతి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణ ఆధ్వర్యంలో గణేష్ చౌక్‌లో స్వీట్లు పంచి, మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సమిశ్రగూడెంలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన, ముస్లిం యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పెండ్యాల లో బాణా సంచా కాలుస్తూ భారీ ర్యాలీ చేశారు. బసివిరెడ్డి పేటలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మేడపాటి లక్ష్మీనారాయణ రెడ్డి అధ్వర్యంలో కేక్‌కట్ చేశారు.
ఉండ్రాజవరం మండలం పాలంగిలో జిల్లా కార్యవర్గ సభ్యుడు బసవ గణేష్ స్వీట్లు పంచారు. జంగారెడ్డిగూడెంలో వైసీపీ శ్రేణులు బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. షిర్డీసాయిఆలయంలో పూజలు నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో నిడమర్రు, గణపవరంలో భారీగా సంబరాలు చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కొవ్వూరులో మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ మెరకవీధిలో, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పరిమిహరిచరణ్ మెయిన్ రోడ్డులో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వీరవాసరంలో జాతీయ రహదారి 216పై వెళ్లే ప్రయాణికులకు, వాహనచోదకులకు స్వీట్లు పంచారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ తోట గోపి ఆధ్వర్యంలో పోలీస్ ఐలండ్ వద్ద సంబరాలు చేశారు. వచ్చీపోయేవారికి మిఠాయిలు పంచారు. భారీ ఎత్తున బాణా సంచా కాల్చి, బైక్ ర్యాలీ చేశారు.
సమైక్య ఉద్యమానికి దేవుడిచ్చిన రథసారథి జగన్
సాక్షి, ఏలూరు : సమైక్యాంధ్ర ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దేవుడిచ్చిన రథసారథి అని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అభివర్ణించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం బెయిల్ మంజూరైన సందర్భంగా బాలరాజు అమితానందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయం, ధర్మం రెండూ వైఎస్ జగన్‌వైపే ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ వైఎస్ జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు పన్నినా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. రాష్ట్ర ప్రజలు సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వైఎస్ జగన్ బయటకు రావడంతో సమైక్య ఉద్యమం మరింత ఉధృతం కానుందన్నారు. ఆయనకు బెయిల్ వచ్చిందనే వార్త సర్వమత వేడుక అని, రాష్ట్రంనుంచి ఇక అంగుళం కూడా ముక్కలవదని బాలరాజు పేర్కొన్నారు.
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెరుుల్ మంజూరు
Published Mon, Sep 23 2013 11:41 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement