hindhu muslim
-
శివ భక్తులకు ముస్లింల సేవలు
జయపురం ఒరిస్సా : సర్వమానవ సమానత్వం మహనీయుల అభిమతమని అది తెలియక కొంతమంది మత పిచ్చిలో మునుగుతున్నారని పలువురు బోల్‌భమ్ భక్తులు వ్యాఖ్యానించారు. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నప్పటికీ వారంతా ఆశించేది కేవలం సర్వమానవ సమానత్వమని అన్నారు. మతం కన్నా మానవత్వమే గొప్పదన్న ఆనాటి మహానీయుల బోధనలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. కొందరు నేడు అజ్ఞానంతో మతం పేరిట దాడులు జరుపుకుంటున్నారని, అలా చేయడం తగదన్నారు. ఎలాంటి మత బేధాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాజంలో అతి కొద్దిమంది స్వార్థపరుల వల్లే ఆనాటి మత ప్రవక్తల గొప్ప భావాలు తప్పుదారి పడుతున్నాయని ఆరోపించారు. బోల్‌భమ్ భక్తులకు చేయూత ప్రతి శ్రావణమాసంలో శివుని దర్శనం కోసం వెళ్లే వేలాది మంది బోల్‌భమ్ భక్తులు కాలి నడకన ఆయా శివ క్షేత్రాలకు వెళ్తుండడం విశేషం. ఈ సందర్భంగా కొరాపుట్ జిల్లాలో కొలువైన గుప్తేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన పలువురి బోల్‌భమ్ భక్తులకు కొరాపుట్ జిల్లాలోని కొంతమంది ముస్లిం సోదరులు ఆహార పదార్థాలు, నీరు, వైద్య సదుపాయం కల్పించి ఆదుకుంటున్నారు. ఇదే తరహాలో పలు స్వచ్ఛంద సంస్థలు కూడా కాలినడకన వెళ్లే అనేకమంది భక్తులకు చేయూతనిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో కాలినడకన వెళ్లే బోల్‌భమ్ భక్తుల కోసం అనేక చోట్ల సహా యం అందించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు కొంతమంది ఔత్సాహికులు కూడా టెంట్లు వేసుకుని మరీ సేవలందిస్తున్న విషయం తెలిసిందే. మతాలకతీతంగా సేవలు మతాలకు అతీతంగా కొంతమంది సేవలందిస్తుండడాన్ని చూసి పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ స ందర్భంగా పలువురు మాట్లాడుతూ మత బేధాలు ముఖ్యం కాదని మానవత్వమే ముఖ్యమని చాటే కార్యక్రమాలకు ముస్లిం సోదరులు శ్రీకారం చుట్టడం శుభపరిణామన్నారు. ఇదే విధంగా అన్ని మతాలు వారు ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా మిత్రభావంతో మెలగాలని ఆకాంక్షించారు. ఏ వైపు నుంచి చూసినా భారతీయులమనే భావం తప్ప మరే ఇతర భావాలు ప్రదర్శించకూడదన్నా రు. అందరూ ఏ మత ప్రమేయం లేకుండా సేవా దృక్పథంతోసమాజానికి సేవలు చేయాలని పిలుపునిచ్చారు. -
మత సామరస్యం వెల్లివిరిసె..
అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన జాతరల్లో రంగాపూర్ ఒకటి. మత సామరస్యానికి దర్పణం పట్టే అతిపెద్ద రెండో ఉర్సు నిరంజన్ షావలీ. ఈ నెల 17న రాత్రి నుం చి వారం రోజుల పాటు వైభవంగా జరుగుతా యి. అచ్చంపేట మండలం రంగాపూర్‌లో జరిగే ఉర్సుకు నల్లమల ప్రజలకు ప్రత్యేక సంబరాలు. హిందూ, ముస్లిం తేడా లేకుండా ఉర్సుకు జిల్లా నలుమూలల నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా లక్షన్నర మందికిపైగా భక్తులు పాల్గొంటారు. భక్తులు కందూరు చేసి మేకలు, గొర్రెలను బలి ఇస్తుంటారు. ఉర్సు రంగాపూర్గా పిలవబడుతున్న ఈ దర్గా వద్ద భక్తులు ఉత్సవాల సమయంలోనే కాక వివిధ రోజుల్లో దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అమ్రాబాద్ మండలం ప్రజలు ఏ శుభకార్యం చేసినా మొదట కొండపై ఉన్న దర్గాను దర్శించుకుని తమ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దర్గా చరిత్ర 600ల ఏళ్ల క్రితం ఆరబ్దేశాల నుంచి అజ్మీర్‌లో స్థిరపడిన హజ్రత్ ఖాజాగరీబ్ నవాస్, ఢిల్లీలో స్థిరపడిన నిజామోద్దీన్ ఔలియా శిఘ్యలు ఇస్లాం మత ప్రచారంలో భాగంగా కాలినడకన తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు. వారిలో ఐదుగురు ప్రముఖులు ఉన్నారు. అందులో హజ్రత్ నిరంజన్‌షావలీ(సయ్యద్ మహమూద్షాఖాద్రి) రంగాపూర్లోను, మరొకరు కొండపై హజ్రత్ బహావోద్దీన్షాఖాద్రిగా స్ధిరపడ్డారు. అలాగే నల్లగొండ జిల్లా జాన్పాడ్ సైదులుగా మరొకరు కొత్తూరు ఇన్ముల్ నర్వ వద్ద జేపీ పీర్లుగా, నిజామాబాద్‌లోని షాహదుల్లా హుస్సేన్, భువనగిరి జమాల్బహాద్లనే పేర్లతో స్థిరపడినట్లు ముస్లిం మతపెద్దలు చెప్పుకుంటున్నారు. ఇస్లాం మత ప్రచార నిమిత్తం నల్లమల ప్రాంతానికి వచ్చిన నిరంజన్‌షావలీ రంగాపూర్‌లో, మన్ననూర్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో బహావోద్దీన్షా కొండ మూల మలుపు వద్ద స్థిరపడ్డారు. వారి మరణాంతరం అక్కడ దర్గాను నిర్మించారు. అ కాలం నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతవాసులు దర్గాలో ఉర్సు నిర్వహిస్తున్నారు. గంధోత్సవం అచ్చంపేటలోని నారాయణప్రసాద్ ఇంటి నుంచి గంధాన్ని తీసుకెళ్లడం అనవాయితీ. 17న రాత్రి అచ్చంపేట మహబుబ్స్వామి దర్గాతో పాటు మన్ననూర్, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, బొమ్మనపల్లి, పెనిమిళ్ల, నాగర్‌కర్నూల్, తెల్కపల్లి, కొల్లాపూర్, వనపర్తి, మహబూబ్‌నగర్ ప్రాంతాల నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకొస్తారు. బొమ్మనపల్లి నుంచి గంధాన్ని గుర్రంపై తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణ. గ్రామాల నుంచి బయలుదేరిన గంధోత్సవాలు అర్ధరాత్రి వరకు రంగాపూర్‌కు చేరుకుంటాయి. అన్ని ప్రాంతాల నుంచి గంధోత్సవాలు చేరుకోగానే భక్తులు నత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజునుంచి ఉర్సు కొనసాగుతుంది. ఉమామహేశ్వర క్షేత్ర సందర్శన రంగాపూర్‌కు 5కిలోమీటర్ల దూరంలో కొండపై వెలసిన ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్గా దర్శనం అనంతరం భక్తులు సందర్శించడం అనవాయితీ. ఉర్సుకు మూడు రోజుల ముందే ఉమామహేశ్వర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉర్సుకు వచ్చిన భక్తులు కులమత భేదాలు లేకుండా ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మత సామరస్యానికి దర్పణం పట్టే ఈ రెండు ఉత్సవాలు ఒకేసారి ముగుస్తాయి. ప్రత్యేక బస్సులు రంగాపూర్ నిరంజన్ షావలీ ఉర్సు, ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అచ్చంపేట–రంగాపూర్ వరకు 25ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అచ్చంపేట–రంగాపూర్– ఉమామహేశ్వర కొండపైకి ఆరు మినీ బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్–అచ్చంపేట, నాగర్‌కర్నూల్–అచ్చంపేట, వనపర్తి, కొల్లాపూర్–అచ్చంపేటకు బస్సులు నడిపిస్తున్నట్లు డీఎం నారాయణ తెలిపారు. -
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెరుుల్ మంజూరు
‘ప్రజలకిచ్చిన మాట కోసం.. తండ్రి ఆశయ సాధన కోసం.. ఎన్ని కష్టాలెదురైనా వెనుదిరగని జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సచ్చీలత రుజువైంది. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని కుతంత్రాలు చేసినా.. ధర్మ పీఠం ముందు నిలబడవని మరోసారి రుజువైంది. కోట్లాది ప్రజల అభిమానం.. ఎందరో ఆత్మీయుల దీవెనల ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరైంది. మా రాజన్న బిడ్డ మా మధ్యకు ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్న మాకు కోర్టు తీర్పుతో పండగొచ్చింది’ ‘పశ్చిమ’ ప్రజలు ఉద్వేగంతో చెప్పిన మాటలివి. వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెరుుల్ మంజూరైందన్న విషయం తెలియగానే పట్టరాని సంతోషంతా జనమంతా రోడ్లపైకి వచ్చారు. సంబరాలు చేసుకున్నారు. ఇన్నాళ్లూ ఆవేదనతో కన్నీరొలికిన వారి కళ్లు ఆనంద బాష్పాలతో తడిశాయి. ‘జయహో జగన్’ నినాదాల నడుమ ఊరూవాడా సంబరాలు మిన్నంటాయి. సాక్షి, ఏలూరు : జననేత.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెరుుల్ మంజూరైన విష యం తెలియగానే జిల్లా ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. బాణసంచా కాల్చారు. స్వీట్లు పం చారు. వాహనాల్లో వెళుతున్న వారు సైతం ఎక్కడికక్కడ ప్రజలతో కలిసి పండగ చేసుకున్నారు. న్యాయమే గెలిచిందంటూ నినాదాలు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటీషన్‌పై తీర్పు వెలువడనుందన్న సమాచారంతో సోమవారం ఉదయం ఆయన అభిమానులు పలు ప్రాంతాల్లో పూజలు చేశారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మకు పానకాలు పోశారు. కుల, మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు పూజలు, ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పెదపాడు మండలం అప్పనవీడులో అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. మధ్యాహ్నం నుంచి ప్రజలు టీవీ లకు అతుక్కుపోయారు. అనుక్షణం ఉత్కంఠకు లోనయ్యారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయనకు బెయిల్ మంజూరైందన సమాచారం తెలుసుకుని హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లవద్ద పం డగ వాతావరణం నెలకొంది. వైసీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జీలుగుమిల్లి జగదాంబ ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. బెయిల్ సమాచారం తెలియగానే నాయకులు ఒకొరినొకరు అలిం గనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో కేక్‌కట్ చేసి కార్యకర్తలు, అభిమానులకు పంచారు. వైఎస్ నిలువెత్తు విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, నాయకులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. నరసాపురం పట్టణం బాణసంచా కాల్పులతో దద్దరిల్లిపోయింది. వేలాది మంది బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని వేడుక చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును అభినందలతో ముంచెత్తారు. భుజాలపై ఎత్తుకుని ఊరేగించారు. భీమవరం పట్టణంలో పెద్దఎత్తున వేడుకలు చేశారు. పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వచ్చీపోయేవారికి స్వీట్లు పంచిపెట్టి ఆనందం పంచుకున్నారు. ఆచంటలో మాజీ ఎమ్మెల్యే మోచర్ల జోహార్‌వతి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణ ఆధ్వర్యంలో గణేష్ చౌక్‌లో స్వీట్లు పంచి, మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సమిశ్రగూడెంలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన, ముస్లిం యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పెండ్యాల లో బాణా సంచా కాలుస్తూ భారీ ర్యాలీ చేశారు. బసివిరెడ్డి పేటలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మేడపాటి లక్ష్మీనారాయణ రెడ్డి అధ్వర్యంలో కేక్‌కట్ చేశారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలో జిల్లా కార్యవర్గ సభ్యుడు బసవ గణేష్ స్వీట్లు పంచారు. జంగారెడ్డిగూడెంలో వైసీపీ శ్రేణులు బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. షిర్డీసాయిఆలయంలో పూజలు నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో నిడమర్రు, గణపవరంలో భారీగా సంబరాలు చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కొవ్వూరులో మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ మెరకవీధిలో, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పరిమిహరిచరణ్ మెయిన్ రోడ్డులో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వీరవాసరంలో జాతీయ రహదారి 216పై వెళ్లే ప్రయాణికులకు, వాహనచోదకులకు స్వీట్లు పంచారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ తోట గోపి ఆధ్వర్యంలో పోలీస్ ఐలండ్ వద్ద సంబరాలు చేశారు. వచ్చీపోయేవారికి మిఠాయిలు పంచారు. భారీ ఎత్తున బాణా సంచా కాల్చి, బైక్ ర్యాలీ చేశారు. సమైక్య ఉద్యమానికి దేవుడిచ్చిన రథసారథి జగన్ సాక్షి, ఏలూరు : సమైక్యాంధ్ర ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేవుడిచ్చిన రథసారథి అని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అభివర్ణించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం బెయిల్ మంజూరైన సందర్భంగా బాలరాజు అమితానందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయం, ధర్మం రెండూ వైఎస్ జగన్‌వైపే ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ వైఎస్ జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు పన్నినా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. రాష్ట్ర ప్రజలు సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వైఎస్ జగన్ బయటకు రావడంతో సమైక్య ఉద్యమం మరింత ఉధృతం కానుందన్నారు. ఆయనకు బెయిల్ వచ్చిందనే వార్త సర్వమత వేడుక అని, రాష్ట్రంనుంచి ఇక అంగుళం కూడా ముక్కలవదని బాలరాజు పేర్కొన్నారు.