తెలంగాణ క్రైస్తవ సేన పిలుపు
హైదరాబాద్: దళిత క్రైస్తవుల విషయంలో మోసపూరితంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం, బీజేపీల అక్రమ కూటమిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని తెలంగాణ క్రైస్తవ సేన పిలుపునిచ్చింది. ఓట్ల కోసం దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేరుస్తానని చంద్రబాబు హామీ ఇస్తే.. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని మతతత్వ బీజేపీ పేర్కొందని సేన వ్యవస్థాపక అధ్యక్షుడు నాగళ్ల పోచయ్య పేర్కొన్నారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ టీడీపీ హామీ ఇచ్చి మోసం చేస్తుండగా.. చట్టసభల్లో దళిత క్రైస్తవుల బిల్లు రాకుండా బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. తమ విషయంలో కాంగ్రెస్ పార్టీ గోడ మీది పిల్లివాటంగా వ్యవహరిస్తూ 60 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉందన్నారు. గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ క్రైస్తవులు, దళిత క్రైస్తవుల గురించి స్పందించకపోవడం విచారకరమన్నారు.
టీడీపీ- బీజేపీ కూటమిని ఓడించండి
Published Mon, Apr 14 2014 1:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement