వర్సోవ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం దీక్షబూనిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోగ్యం వెంటనే కుదుట పడాలని కోరుతూ ‘పాట్నర్స్ ఆఫ్ బైబిల్ గాస్పెల్ మినిస్ట్రీస్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంధేరి పశ్చిమంలోని వర్సోవ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండర్ అధ్యక్షులు రెవ. జయరాజు, సంఘం పెద్దలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ‘వైఎస్‌ఆర్ కుటుంబం చీకటిలో దీపంలా సమాజానికి వెలుగులు పంచింది’’ అని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి డానియేలు, హిజయన్న, జి.లింగన్న, శాంతి రాజు, జి.ఇసాకు, జి.ఏసయ్య, పి.ఇమ్మాన్యుయేలు తదితరులు పాల్గొన్నారు.