వారం రోజుల క్రితం అదృశ్యమైన టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) ఉద్యోగిని ఒకరు హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహాన్ని తాము గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఉమా మహేశ్వరి అనే ఈ మహిళ హత్యకు గురైందనే వారు భావిస్తున్నారు. ఆమె శరీరంపై లోతైన గాయం ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో కూడా వెల్లడైందని ఓ అధికారి తెలిపారు.
ఉమా మహేశ్వరి (24) ఈనెల 13వ తేదీ (వాలెంటైన్స్ డేకు ఒక్కరోజు ముందు) ఆఫీసు నుంచి సాయంత్రం వెళ్లిన తర్వాతి నుంచి కనపడకుండా పోయింది. శనివారం నాడు ఓ పొద సమీపంలో ఆమె మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె గత ఏడాది నుంచి టీసీఎస్లోని అకౌంట్స్ విభాగంలో పనిచేస్తోందని, సహోద్యోగులంతా ఆమెను మెచ్చుకుంటారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
టీసీఎస్ ఉద్యోగిని హత్య?
Published Sat, Feb 22 2014 10:48 PM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM
Advertisement
Advertisement