పేకాట వివాదంలో వ్యక్తికి కత్తిపోట్లు | Poker stabbing the person in the conflict | Sakshi
Sakshi News home page

పేకాట వివాదంలో వ్యక్తికి కత్తిపోట్లు

Published Mon, Jul 18 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

Poker stabbing the person in the conflict

బొల్లారం : తిరుమలగిరి పోలీస్టేషన్ పరిధిలోని శ్మశాన వాటికలో జరిగిన పేకాట వివాదంలో కుమార్‌ (50) అనే వ్యక్తి కత్తి పోట్లకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం శ్మశాన వాటికలో నలుగురు కలిసి పేకాటాడుతుండగా కుమార్, రవి అనే వ్యక్తి కి రూ.50 లు బాకీ పడ్డారు. దానికోసం ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగడంతో రవి తన బ్యాగులో నుంచి కత్తి తీసి కుమార్‌ మెడ, చాతీపై దాడి చేయడంతో తీవ్రగాయలయ్యాయి. కుమార్‌ను గాంధీ అసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement