దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై దాడి | Video: South Korean Opposition Leader Lee Jae-myung Stabbed In Neck | Sakshi
Sakshi News home page

Video: దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై గుర్తు తెలియని వ్యక్తి దాడి

Published Tue, Jan 2 2024 9:16 AM | Last Updated on Tue, Jan 2 2024 9:29 AM

South Korean opposition leader Lee Jae myung was stabbed In Neck - Sakshi

దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత దాడి లీ జే మ్యుంగ్ జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన బూసన్‌ నగరంలో కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్‌ పోర్టు సైట్‌ను సందర్శించారు. అనంతరం లీ జే మ్యుంగ్ మీడియాతో మాట్లాడున్న సమయంలో పెద్ద సంఖ్యయలో యువకులు  చుట్టూ చేరారు.

ఒక్కసారిగా ఓ యువకుడు లీ జే మ్యుంగ్‌పై దాడి చేశాడు. కత్తి వంటి ఓ ఆయుధంతో ఆయన మెడపై బలంగా పొడిచాడు. దీంతో లీ జో కుప్పకూలిపోయాడు. వెంటనే స్పదించిన భద్రత అతన్ని అక్కడి నుంచి లాక్కువెళ్లి అరెస్ట్‌ చేశారు. లీ జే మ్యుంగ్‌ను స్థానికఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందాల్సి ఉంది.

దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రతిపక్ష నేత లీ జే పై జరిగిన దాడి ఘటనను దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిటం సరికాదని అన్నారు. అయితే 2022లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీ యూన్ సుక్ యోల్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్‌ దాడులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement