వాణిజ్య రాజధాని ముంబై లో మరో దారుణం జరిగింది. స్నేహితునికోసం వేచివున్న మహిళ(28)పై గుర్తుతెలియని దుండగుడు దాడిచేశాడు.
ముంబై: వాణిజ్య రాజధాని ముంబై లో మరో దారుణం జరిగింది. స్నేహితునికోసం వేచివున్న మహిళ(28)పై గుర్తుతెలియని దుండగుడు దాడిచేశాడు. హాలక్ష్మి రేస్ కోర్స్ దగ్గర గురువారం రాత్రి ఈ అఘాయిత్యం చోటుచేసుకుంది.
పదునైన ఆయుధంతో వెనకనుంచి ఎటాక్ చేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపు మడుగులో పడివున్న ఆమెను గుర్తించిన స్నేహితుడు వెంటనే ఆసుపత్రికి తరలించాడు. ఈఘటనపై పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.