
ప్రతీకాత్మక చిత్రం
గుంటూరు : తనను ప్రేమించలేదనే కారణంతో ఓ యువతిపై చిన్నా అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన యువతి తల్లీ, చెల్లెలికి కూడా గాయాలయ్యాయి. ముగ్గురినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన పాత గుంటూరులో శుక్రవారం జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని చిన్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment