సాక్షి, గుంటూరు: సమాజంలోని న్యాయాలు, అన్యాయాలు వివరిస్తున్న మంత్రి అంబటి రాంబాబును టీడీపీ మట్టుపెట్టాలని చూస్తుందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంత్రి అంబటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ దాడిని సమాజం చూస్తూ ఊరుకోదని, దుర్మార్గులని ఏరేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నామని అన్నారు.
ఇది పరిణితి చెందిన సమాజమని, దుర్మార్గులకు ఈ సమాజంలో తావులేదని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకుడు హత్య దుర్మార్గమైన చర్య అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment