మేకలు కాసేందుకు వెళ్లిన యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించి, అది సాధ్యం కాకపోవడంతో కత్తితో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చిత్తూరు:
మేకలు కాసేందుకు వెళ్లిన యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించి, అది సాధ్యం కాకపోవడంతో కత్తితో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం డొలగుట్ట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఒక యువతి ఆదివారం మేకలు కాసుకొని వస్తుండగా సాయంత్రం ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. అయితే, అదే సమయంలో అక్కడ ఉన్న గ్రామస్తులు ఇది గమనించడంతో కత్తితో ఆమె పీక కోసి పరారయ్యారు. కాగా, బాధితురాలిని వెంటనే మెరుగై వైద్యం కోసం కుప్పం తరలించారు. మంగళవారం విషయం తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.