ఇంటి ఎదుట వీధి కుక్కలకు దానా వేస్తుండగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ కత్తి పోట్లకు దారి తీసింది
చైతన్యపురి: ఇంటి ఎదుట వీధి కుక్కలకు దానా వేస్తుండగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ కత్తి పోట్లకు దారి తీసింది. స్థానిక సీఐ గురు రాఘవేంద్ర కథనం ప్రకారం.. ఎస్‌ఆర్‌ఎల్ కాలనీ రోడ్ నెంబర్.6లో బాణాల వెంకట రమణాచారి అద్దెకు ఉంటున్నారు. ప్రతి రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి వీధి కుక్కలకు దానా వేయడానికి తన కారు హారన్ మోగిస్తుండగా, ఈయన ఇంటి సమీపంలోనే ఉండే కాలనీ కార్యదర్శి అశోక్‌చారి బయటికి వచ్చి రమణాచారితో గొడవ పడ్డారు. ఇరువురు కొట్టుకున్నారు. దీంతో ఆవేశానికి గురైన రమణాచారి ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి అశోక్‌చారి కడుపులో పొడిచారు. అశోక్‌చారి అరవగా చుట్టపక్కల వారు వచ్చి ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. రమణాచారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.