అమ్మాయిని ప్రేమించినందుకు ఆమె అన్నలు ముగ్గురు కలిసి దేశ రాజధాని నడిబొడ్డున ఓ వ్యక్తిని కత్తులతో పలుమార్లు పొడిచేశారు. తీవ్ర గాయాల పాలైన సదరు బాధితుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సుజిత్ అనే ఈ ప్రేమికుడిని అమ్మాయి అన్నయ్యలు ముగ్గురు, వారి స్నేహితుడొకరు కలిసి ఏకంగా 15 సార్లకు పైగా కత్తులతో పొడిచినట్లు తెలుస్తోంది. తూర్పు ఢిల్లీలోని త్రిలోక్పురి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
బాధితుడిని తొలుత సమీపంలో ఉన్న ఆస్పత్రిలో చేర్చి, తర్వాత అక్కడినుంచి సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు అక్కడే మృత్యువుతో పోరాడుతున్నాడు. కత్తిపోట్లు పొడిచిన వారిలో అమ్మాయి అన్నల్లో ఒకరితో పాటు వారి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరు సోదరులు పరారీలో ఉన్నారు. సుజిత్కు ఆ అమ్మాయితో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఈ విషయమై కోపగించిన ఆమె అన్నలు.. కొన్ని రోజుల క్రితమే సుజిత్ను తమ చెల్లెలికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. కానీ మళ్లీ ఆమె సుజిత్తో కలిసి తిరుగుతుండటం చూసి, ఇంటి నుంచి బయటకు పిలిచి పొడిచి పారిపోయారని పోలీసులు తెలిపారు.
చెల్లెలిని ప్రేమించాడని 15 కత్తిపోట్లు
Published Sat, Aug 10 2013 9:55 PM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement
Advertisement